Stroke cases: స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకర పరిస్థితి. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకం కాగలదు. దేశంలో పెరుగుతున్న కేసులే ఇందుకు కారణం. కోవిడ్ మహమ్మారి కారణంగా స్ట్రోక్ కేసులు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగాయి. ప్రతి 4 నిమిషాలకు ఒకరు స్ట్రోక్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో మరణాలకు రెండవ ప్రధాన కారణం స్ట్రోక్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్ కారణంగా దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు. దేశంలో ప్రతియేటా స్ట్రోక్‌కు సంబంధించినవి దాదాపు 1 లక్షా 85 వేల కేసులు వెలుగు చూస్తున్నాయని..ఇందులో ప్రతి 40 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారనేది అంచనా అని కొందరు వైద్యులు చెబుతున్నారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ప్రకారం దేశంలో స్ట్రోక్ కేసులు 68.6 శాతం ఉంటున్నాయి. 70.9 శాతం మరణాలు స్ట్రోక్ కారణంగానే సంభవిస్తున్నాయి.


దీనికితోడు స్ట్రోక్ కేసులు ఎక్కువగా యువకులు, మధ్య వయస్కుల్లో కన్పిస్తోంది. 20 ఏళ్ల వయస్సు కలిగినవారు దాదాపు 52 లక్షలమంది స్ట్రోక్‌కు గురవుతున్నారు. స్ట్రోక్ వచ్చినప్పుడు సరైన వైద్యం అందించే సదుపాయాలు కూడా దేశంలో తక్కువే ఉన్నాయని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో స్ట్రోక్‌కు సరైన చికిత్స అందించే సౌకర్యాలు తక్కువే ఉన్నాయి.


స్ట్రోక్ అనేది ప్రాణాంతకం కావచ్చు లేదా పక్షవాతానికి దారి తీయవచ్చు. అందుకే సాధ్యమైనంత వేగంగా చికిత్స అందించాలి. స్ట్రోక్ చికిత్సకు గోల్డెన్ విండోగా 4-5 గంటలుంటుంది. గోల్డెన్ విండో సమయం దాటితే..న్యూరాన్స్ నష్టాన్ని దూరం చేయడం సాధ్యం కాదు. సకాలంలో స్ట్రోక్ రోగికి సరైన చికిత్స అందించే విషయంలో..పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సౌకర్యాల్లో చాలా తేడా కన్పిస్తోంది. టెలీమెడిసిన్ అనేది ఈ పరిస్థితిని నివారించేందుకు దోహదపడుతుంది.


ఇండియాలో పేద, ధనిక వర్గాలకు సౌకర్యాల్లో కొరతను అధిగమించేందుకు టెలీస్ట్రోక్ మోడల్ ఉపయోగపడుతుంది. న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం..డిప్రెషన్ అనేది స్ట్రోక్‌కు కారణం కావచ్చు. డిప్రెషన్ లక్షణాలున్నవారిలో స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. 


మరోవైపు కోవిడ్ మహమ్మారి కూడా స్ట్రోక్ కేసులు పెరగడానికి కారణంగా ఉంది. అమెరికాలోని ధామస్ జెఫర్సన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం..కోవిడ్ రోగుల్లో ప్రతికూల పరిణామాల కారణంగా స్ట్రోక్ నయం చేసేందుకు కఠిన పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తోంది. 


Also read: Hongkong Flu: దేశంలో కొత్త వైరస్, హాంకాంగ్ వైరస్‌తో అప్పుడే ఇద్దరి మృతి, 90పైగా కేసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook