Hongkong Flu: దేశంలో కొత్త వైరస్, హాంకాంగ్ వైరస్‌తో అప్పుడే ఇద్దరి మృతి, 90పైగా కేసులు

Hongkong Flu: దేశంలో కొత్త వైరస్ కలవరం కల్గిస్తోంది. హాంకాంగ్ ఫ్లూ హెచ్3ఎన్2 వైరస్ ఇండియాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అప్పుడు దేశంలో ఈ కొత్తరకం వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2023, 05:33 PM IST
Hongkong Flu: దేశంలో కొత్త వైరస్, హాంకాంగ్ వైరస్‌తో అప్పుడే ఇద్దరి మృతి, 90పైగా కేసులు

Hongkong Flu: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు మరో వైరస్ భయపెడుతోంది. ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాపిస్తోంది. హాంకాంగ్ ఫ్లూగా పిలుస్తున్న ఈ వైరస్‌నే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అని కూడా అంటున్నారు. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటి వరకూ ఈ వ్యాధి బారినపడినవారు 90 మంది ఉన్నారని తెలుస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ కొత్తరకం వైరస్ సోకి హర్యానాలో తొలి వ్యక్తి మరణించగా..తాజాగా కర్ణాటకలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఈ వైరస్‌నే హాంకాంగ్ ఫ్లూగా కూడా పిలుస్తున్నారు. ఈ వ్యాధి సోకినవారిలో ముఖ్యంగా జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఇబ్బంది, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. వీటితో పాటు వాంతులు వచ్చినట్టుండటం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా లక్షణాలు కూడా ఉంటున్నాయి. ఈ లక్షణాలు వారానికి పైగా ఉంటే కచ్చితంగా అనుమానించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. 

ఇదే ఇన్‌ఫ్లుయెంజాలో మరో రకమైన హెచ్1ఎన్1 కేసులు కూడా దేశవ్యాప్తంగా 8 నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా వచ్చే జ్వరం 5-6 రోజుల్లో తగ్గిపోతున్నా..దగ్గు మాత్రం మూడు వారాల వరకూ ఉంటోంది. ఈ వ్యాధి లక్షణాలు దాదాపుగా కోవిడ్ లక్షణాలను పోలి ఉన్నాయి. ఎక్కువమంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉండటంతో హాస్పిటల్ జాయినింగ్ అధికమౌతోందని ఐసీఎంఆర్, ఐఎంఏలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ లక్షణాలు ఎక్కువ రోజులుంటే నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. హర్యానా, కర్ణాటకలో ఇద్దరు మరణించినా..ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది ప్రభుత్వం. 

Also read: Banana Side Effects: ఈ 5 సమస్యలున్నవాళ్లు అరటి పండ్లకు దూరంగా ఉండాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News