sudden cardiac arrest : కసరత్తులు ఎక్కువ చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం
Sudden cardiac arrest associated With Extreme Exercise: బాడీ ఫిట్‌గా ఉండాలన్నా.. చూడడానికి ఆకర్షనీయంగా ఉండాలన్నా జిమ్‌లో గంటల తరబడి కష్టపడాల్సిందే. అలా అని ఎక్కువ కసరత్తులు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. కానీ సిద్థార్థ్.... ఫిట్‌నెస్ (fitness) ఫ్రీక్. అయినా కూడా గుండెపోటుతో చనిపోయారు.
Sudden cardiac arrest associated With Extreme Exercise:కసరత్తు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు అనే విషయం అందరికీ తెలిసిందే. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా.. చూడడానికి ఆకర్షనీయంగా ఉండాలన్నా జిమ్‌లో గంటల తరబడి కష్టపడాల్సిందే. అలా అని ఎక్కువ కసరత్తులు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా (siddharth shukla) హఠాన్మరణం అందరికీ తెలిసిందే. ఇందులో దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే.. 40 ఏళ్ల వయసులో సిద్థార్థ్ గుండె పోటుతో (heart attack) మరణించడం. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. కానీ సిద్థార్థ్.... ఫిట్‌నెస్ (fitness) ఫ్రీక్. అయినా కూడా గుండెపోటుతో చనిపోయారు. సిద్థార్థ్ సెలబ్రిటీ కాబట్టి ఆయన మరణం గురించి మన అందరికీ తెలిసింది. కానీ సిద్ధార్థ్‌లానే చాలా మంది ఫిట్‌నెస్ ఫ్రీక్ యువత ప్రాణాలు వదిలిన ఘటనలు కూడా ఉన్నాయి.
దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే ఎక్కువగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయాయం (Extreme Exercise) చేయడం వల్లనే సిద్ధార్థ్ సడెన్‌గా హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు అంటున్నారు డాక్టర్లు. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి ఒక అరగంట లేదంటే నలభై నిమిషాల వ్యాయామం సరిపోతుంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు గంటల తరబడి జిమ్‌కే పరిమితం అవుతుంటారు. సిద్ధార్థ్ కూడా రోజూ మూడు గంటలకు పైగానే వ్యాయామాలు చేసేవాడు. ఇలా అతి వ్యాయామం అస్సలుఉ వద్దని డాక్టర్లు గతంలోనే సిద్ధార్థ్‌కు సూచించినాడు ఆయన వినలేదు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
Also Read : Heart Attack: గుండెపోటుకు చెక్ పెట్టాలంటే... కచ్చితంగా ఈ 5 విషయాలు పాటించండి!
సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే అవకాశం
అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం ఎక్కువగా వ్యాయామం (Too much Exercise) చేయడం వల్ల సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే అవకాశం ఉందని వెల్లడైంది. దీంతో వెంటనే ప్రాణాలు కోల్పొతారు. మితిమీరి కాకుండా లిమిట్‌లో చేస్తేనే ఫిట్‌గా (Fit) ఆరోగ్యంగా ఉంటారు. గతంలో స్వీడన్‌కు చెందినో ఓ ప్రముఖ పరిశోధన సంస్థ చేసిన అధ్యయనంలోనూ ఇలాంటి విషయాలే వెల్లడయ్యాయి. ఎంత ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే శరీరానికి అంత అనర్థం అనే విషయం కూడా ఈ అధ్యయనంలో తేలింది. మొత్తం 11 మందితో వారానికి 152 నిమిషాల పాటు హై ఇన్‌టెన్సిటీ వ్యాయామం (high intensity exercise) చేయించారు. 100 నిమిషాల హై ఇన్‌టెన్సిటీ వ్యాయామం దాటితే వారిలో శక్తి తగ్గినట్టు నిర్ధారణకు వచ్చారు. ఆ ఎఫెక్ట్.. బాడీ మెటాబలిజంపై కూడా పడినట్టు గుర్తించారు. గ్యాప్ ఇవ్వకుండా ఒకే సారి ఎక్కవ సేపు ఈ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తించారు.
బాడీ మొత్తం పనికిరాకుండా తయారవుతుంది
అతి వ్యాయామాల వల్ల శరీరం ఎక్కువగా అలసిపోవడమే కాకుండా శక్తి హీనంగా తయారయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా బయటపడింది. అందుకే వారానికి 90 నిమిషాలు మించ కుండా చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 90 నిమిషాలు చేస్తే చాలని చెబుతున్నారు. దీంతో మీరు కోరుకుంటున్న బాడీ ఎలాస్టిసిటీ, (Body elasticity) ఫ్లెక్సిబులటీతోపాటు మరిన్ని ఆరోగ్యంగా ఉండగలుగుతారు. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో (Blood sugar levels) విపరీతమైన హెచ్చుతగ్గులు కనిపించే ప్రమాదం ఉంది. మితిమీరిన వ్యాయమాలు చేసే వారిలో ఎముకల సంబంధ సమస్యలతోపాటు హార్ట్ ఎటాక్స్ (Heart Attacks) వస్తాయి. కోవిడ్ నేపథ్యంలో ఈ మధ్య చాలా మంది నిపుణుల ఆధ్వర్యంలో కాకుండా ఫిట్‌నెస్ యాప్‌ల ఆధారంగా ఇష్టానుసారంగా గంటల తరబడి వ్యాయామం చేస్తున్నారు. అలాంటి వారంతా మితిమీరిన వ్యాయామంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
Also Read : Shiva puja on Monday: శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా ? సోమవారం ప్రత్యేకత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook