Triphala Churna Benefits: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధం,కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి అనేక రకాల జీర్ణసంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలు రావడానికి కారణం మనం జంక్‌ ఫూడ్స్‌, ప్యాకేజింగ్ ఫూడ్స్‌పై మొగ్గు చూపడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ప్రధాన కారణం అని ఆయుర్వేద  నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మంది ఈ స‌మ‌స్య‌ల బారి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల మందుల‌‌ను వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య కొంత‌మేర త‌గ్గిన‌ప్ప‌టికి వీటి వ‌ల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడం ఎలా తెలుసుకుందాం..జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి స‌హ‌జ సిద్దంగా కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని ఆయుర్వేద  నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వ‌చ్చే వివిధ ర‌కాల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లను స‌హ‌జ‌సిద్దంగా ఎలా త‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


Also Read: Lemon Peel Powder: నిమ్మతొక్కలో ఉండే ప్రయోజనాలు ఇవే ! దీంతో సమస్యలకు గుడ్‌ బై..!



జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో  త్రిఫ‌లా చూర్ణం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. త్రిఫలా చూర్ణం తయారు చేసుకోనే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.. ఉసిరికాయ‌లు, క‌రక్కాయ, తానికాయ. ఈ మూడు కాయ‌ల‌తో త‌యారు చేసిందే త్రిఫ‌లా చూర్ణం.  ఈ త్రిఫ‌లా చూర్ణం మ‌నకు ఆయుర్వేద షాపుల్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. 
జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు ఇత‌ర అనేక ర‌కాల అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌గ్గించ‌డంలో త్రిఫ‌లా చూర్ణం సహాయపడుతుంది.

 


Also Read: Melatonin Rich Foods: ఏం చేసినా రాత్రి నిద్ర పట్టడం లేదా? ప్రతిరోజు ఇవి తినండి చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి