Lemon Peel Powder Benefits: నిమ్మకాయతో ఎక్కువుగా రసాన్ని తయారు చేస్తు ఉంటాం. నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలో శరీరానికి అవసరమయ్య పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే నిమ్మకాయ రసం తీసిన తరువాత మనం దాని తొక్కను పాడేస్తూ ఉంటాం. కొంతమంది దాని తొక్కతో పూజా సామగ్రిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీనిని వీటికే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అది ఎలా తయారు చేసుకోవాలి దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ రసాన్ని తీసుకున్న తరువాత దీని తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఎండబెట్టాలి. తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ 20 % వరకు తగ్గాయని నిపుణులు పరిశోధనల ద్వారా చెబుతున్నారు. ఇది నీళ్లలోనే కాకుండా మజ్జిగలో కూడా కలుపుకుని తాగవచ్చు.
Also Read: Diabetes Control Tips: డయాబెటిస్‌ను కూకటివేళ్లతో పెకిలించే రసాలు ఇవే..తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు..
నిమ్మకాయ తొక్క ప్రయోజనాలు..
నిమ్మ తొక్క పొడి తీసుకోవడం కారణంగా గుండె జబ్బులు, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ సమస్యలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం కారణంగా దీర్ఘకాల సమస్యల బారిన ముక్తి లభిస్తుంది. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చని, వీటితో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
>> నిమ్మ తొక్కల్లో అధికంగా పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, ఎ, సి, డి-లైమోనీన్ వంటి అనేక పోషకాలున్నాయి.
>> నిమ్మతొక్కల్లో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం కూడా అధికంగా లభిస్తాయి.
>> నిమ్మతొక్కల్లో ఉండే పొటాషియం మనలో ఉండే హైబీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులను నివారిస్తుంది.
>> ఇక నిమ్మ తొక్కల పొడిలో క్యాన్సర్ కణాలను రాకుండా ఉండే గుణాలున్నాయి.
>> డయాబెటిస్, గుండె జబ్బులను కూడా నిమ్మతొక్క నివారిస్తుంది.
>> తెల్ల రక్త కణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నవారికి నిమ్మతొక్కలు దివ్య ఔషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
>> నిమ్మతొక్కల్లో ఉండే విటమిన్ సి శరీరంలో యాంటీ బాడీలను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది.
Also Read: Migraine Home Remedies: చలి కారణంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారా..తప్పకుండా ఇవి ఫాలో అవ్వండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి