Foods That Help You Sleep: నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో మేలు.. కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి తప్పకుండా సరైన పరిమాణంలో నిద్ర పోవాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఒత్తిడి ఆధునిక జీవనశైలి కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నిద్రలేమి సమస్యలు కారణంగా శరీర సమస్యలే కాకుండా చాలామందిలో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయట. కాబట్టి ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే నిద్ర మాత్రలను ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి బదులుగా కొన్ని హోమ్ రెమెడీస్ ని ప్రతిరోజు పాటిస్తే తప్పకుండా నిద్రలేమి సమస్య నుంచి బయటపడతారు.
బాదం:
బాదం పప్పులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు మెలటోనిన్ అనే మూలకం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాదం గింజలను పొడిలా తయారు చేసుకొని ప్రతిరోజు పడుకునే క్రమంలో పాలలో మిక్స్ చేసుకొని తాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో లభించే మెగ్నీషియం అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
కివి:
కివిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట ఈ పండును తీసుకోవడం వల్ల సులభంగా నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా కివిలో సెరోటోనిన్ అనే మూలకం అధిక అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఈ పండును ప్రతి రోజు తినడం వల్ల గాఢమైన నిద్ర అందించేందుకు తోడ్పడుతుంది.
Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు
వాల్‌నట్స్:
వాల్‌నట్స్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా వచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో మెలటోనిన్ కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి నిద్రపోయే ముందు వీటిని తీసుకోవడం వల్ల గాడమైన నిద్రను పొందుతారు.
చమోమిలే టీ:
చమోమిలే టీ కూడా నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు తగ్గించి గాడమైన నిద్రను అందించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజు ఈ టీ ని తాగడం వల్ల మెరుగైన నిద్ర పొందడమే కాకుండా శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి