COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Diabetes - Sugar Level Normal: ఆధునిక జీవనశైలి కారణంగా రోజురోజుకు డయాబెటిస్‌తో బాధపడే వారి సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఒకే చోట కూర్చుని పనులు చేయడం, నూతన ఆహార పలబాట్లు, వ్యాయామాలు లేకపోవడం వంటి కారణాలవల్ల తొందరగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మందిలో 11 మంది అతి చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారని తాజా అధ్యయనాలు తెలిపాయి. ఈ డయాబెటిస్‌తో బాధపడేవారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోలేక పోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆహార పలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలను కూడా పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడానికి తప్పకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆహారాలను పొరపాటున కూడా తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే రోజు తీసుకునే ఆహారాలను డైట్ పద్ధతిలో తినడం ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో బచ్చలి కూరతో పాటు మెంతికూర వంటి పచ్చని ఆకుకూరలను తీసుకోవడం వల్ల సులభంగా డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు.


ప్రస్తుతం చాలామందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. వీరికి పుదీనా ఆకు ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకులో ఉండే కొన్ని యాసిడ్స్ రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా కంట్రోల్ చేస్తాయని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది. దీని కారణంగా డయాబెటిస్‌తో బాధపడే వారిలో వచ్చే వాపులు, ఒత్తిడి కూడా సులభంగా తగ్గుతాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


అలాగే పుదీనా ఆకుల్లో అధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఇది డయాబెటిస్‌తో బాధపడే వారికి చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిని ఆహారంలో తీసుకోవడం కారణంగా ఒత్తిడి సులభంగా తగ్గుతుంది. దీంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల అనేక లాభాలు కలుగుతాయని చాలామంది అతిగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం మంచిది కాదని వారు అంటున్నారు. పుదీనాను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని తగిన మోతాదులో తీసుకోవడమే ఎంతో మంచిది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి