వేసవిలో సహజంగానే రోగ నిరోధక శక్తిని పెంచుకోవల్సి ఉంటుంది. దీనికోసం ప్రకృతిలో విస్తృతంగా లభించే నిమ్మకాయ ఒక్కటి సరిపోతుంది. వేసవిలో ఆరోగ్యం సంరక్షించుకునేందుకు నిమ్మ నీళ్లు అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం నిగారింపు వస్తుంది. ఇంకా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిమ్మ రసాన్ని భోజనంలో పిండుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇవి చర్మం నుంచి శరీరం ఆరోగ్యం వరకూ అన్నింట్లోనూ లాభదాయకం. వేసవిలో రోజూ నిమ్మ నీళ్లు తాగడం వల్ల శరీర సంబంధ సమస్యలు దూరమౌతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మకాయలో ప్యాక్టిన్ పుష్కలం ఉంటుంది. నిమ్మరసం ఎక్కువ సేపు ఆకలేయకుండా నియంత్రించగలదు. ఫలితంగా బరువు రోజురోజూకూ తగ్గడం గమనించవచ్చు. నిమ్మకాయలు బరువు తగ్గించేందుకు, కొవ్వు కరిగించేందుకు దోహదపడుతుంది.


నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమోతాదులో లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే శరీర కణజాలానికి నష్టం కలుగుతుంది. గుండెపోట్లు, మధుమేహం, కొన్ని రకాల కేన్సర్‌కు దారితీస్తుంది. మొత్తానికి ఆరోగ్యం పాడవుతుంది.


నిమ్మకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అదే సమయంలో మధుమేహం ముప్పుని తగ్గించడంలో కూడా దోహదపడుతంది. డయాబెటిస్ రోగులు రోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం సేవిస్తే చాలామంచిది.


నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే విటమిన్ సికు కేరాఫ్ నిమ్మరసమే. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొదిస్తుంది. దాంతోపాటు విటమిన్ సి శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ఇది శరీరాన్ని అంటువ్యాధులు, సంక్రమణ నుంచి కాపాడుతుంది. నిమ్మరసం తాగినప్పుడు ఇన్‌స్టంట్ ఎనర్జీ లభించడమనేది అత్యంత ముఖ్యమైంది


నిమ్మరసం తొక్క, గుజ్జులో పేక్టిన్ అనే లిక్విఫైడ్ ఫైబర్ పెద్దమొత్తంలో లభిస్తుంది. ఇది లివర్‌లో జీర్ణక్రియ ఎంజైమ్  నిర్మాణాన్ని పెంచుతుంది. దాంతో శరీరం నుంచి విష పదార్ధాలు తొలగిపోతాయి.


Also read: Diabetes Control Tips: మఖానా రోటీతో మధుమేహం 8 రోజుల్లో తగ్గడం ఖాయం!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook