Sun stroke tips: వేసవి పీక్స్‌కు చేరుతోంది. మే నెలలో ఎండలు ఇంకా తీవ్రం కానున్నాయి. వడదెబ్బ ముప్పు పొంచి ఉంటుంది. ఈ నేపధ్యంలో చిన్నారులను ఎలా రక్షించుకోవాలనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఇంకా పెరగనుంది. ముఖ్యంగా తీవ్రమైన వడగాల్పులు వీయనున్నాయి. మే నెలలో వేసవి ఎండల్నించి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. చిన్నారులు, వృద్ధులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ఈ నేపధ్యంలో చిన్నారుల్ని, వృద్ధుల్ని వడదెబ్బ తగలకుండా ఎలా రక్షించుకోవాలనేది తెలుసుకుందాం. కొన్ని రకాల పోషకాహారాన్ని అలవాటు చేయడం ద్వారా చిన్నారులకు వడదెబ్బ ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.


పుదీనా పరాటా. ఇది శరీరానికి బలంతో పాటు చలవ చేస్తుంది. వడదెబ్బ తగలకుండా మంచి బలవర్ధకమైన ఆహారంగా ఉంటుంది. మరో ముఖ్యమైంది పెరుగు దోసకాయ. ఇందులో ఉండే 90 శాతం నీరు అద్భుతమైన హైడ్రేటెడ్ ఫుడ్‌గా పనిచేస్తుంది. పెరుగు శరీరానికి చలవ చేస్తే..దోసకాయ మంచి హైడ్రేటెడ్ ఫుడ్‌గా పనిచేస్తుంది. సత్తు పరోటా మరో కీలకమైన ఆహారం. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇదే సత్తుతో షర్బత్ కూడా చేసి ఇవ్వవచ్చు. 


ఇక తాజా కూరగాయలు, పండ్ల రసం లేదా జ్యూస్ చిన్నారులకు అలవాటు చేయాలి. పుచ్చకాయలు, ఆరెంజ్, కివీలు ఆరోగ్యానికి బలాన్నిస్తాయి. త్వరగా ఎండదెబ్బ తగలకుండా..కాపాడుకోవచ్చు. 


Also read: Figs For Bones: మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? వెంటనే అంజీర్ ను ఆహారంలో చేర్చుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook