Figs For Bones: మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? వెంటనే అంజీర్ ను ఆహారంలో చేర్చుకోండి

Figs For Bones:  మీ ఎముకలు బలంగా ఉండాలంటే..మీ ఆహారంలో అంజీర్ పండ్లను చేర్చుకోండి. దీని ప్రభావం వెంటనే కనిపించాలంటే.. దానిని తినే పద్ధతి మీకు తెలియాలి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 06:51 PM IST
Figs For Bones: మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? వెంటనే అంజీర్ ను ఆహారంలో చేర్చుకోండి

Figs For Bones: ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర్ (Figs) పండ్లు చాలా మేలు చేస్తాయి. ఆహారంలో భాగంగా వీటిని తీసుకోండి. నిజానికి అత్తి పండ్ల (అంజీర్ లేదా ఫిగ్స్)లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. అందువల్ల, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. దీనితో పాటు, అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఎముకలు దృఢంగా ఉండాలంటే అంజీర్ పండ్లను (Anjeer Fruit) ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. 

నానబెట్టిన అంజీర్ పండ్లను తినండి

ఎక్కువగా నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంటే నేరుగా తినలేని వారు నానబెట్టి తినవచ్చు. దీని వల్ల మీరు మరింత ప్రయోజనం పొందుతారు. ఎముకలను బలోపేతం చేయడానికి ఇది ఉత్తమ మార్గం. 

అంజీర్ ఉపయోగాలు
**నానబెట్టిన అంజీర్ పండ్లు ఎముకలను బలోపేతం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఎవరి ఎముకల బలహీనంగా ఉన్నాయనుకుంటే వారు తినవచ్చు.  
**నానబెట్టిన అంజీర్ ఆరోగ్యకరమైన గుండెకు చాలా మేలు చేస్తుంది. నిజానికి, దీన్ని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
**దీనితో పాటు, జీర్ణవ్యవస్థ యొక్క సమస్యలు కూడా దీని వినియోగం వల్ల తొలగిపోతాయి. నిజానికి అంజీర్  పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది ఎలాంటి కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటుంది. 
** శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలి. ఇది శరీరంలోని రక్తహీనత లోపాన్ని తొలగిస్తుంది. 

Also Read: Skin Care Tips: పుచ్చకాయతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా మీ సొంతం! ఇలా చేయండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News