Foods For Men's Health: పురుషులు వృత్తిరీత్యానో లేక ఉద్యోగం రీత్యానో తమ పనుల్లో తాము బిజీ అవడం వల్ల చాలా మంది ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ వహించరు. ఆఫీసుకు వెళ్తే ఆఫీసు బాధ్యతలు... ఇంటికొస్తే ఇంట్లో బాధ్యతలు.. ఇలా వీటితోనే సతమతమవుతూ తమ ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తుంటారు. కానీ ఆరోగ్యం విషయంలో జెంట్స్‌కి అయినా.. లేడీస్‌కి అయినా ఒకటే రూల్ వర్తిస్తుంది. అదే ఆరోగ్యమే మహా భాగ్యం.. అంటే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుంటే అంతకంటే మహా భాగ్యం మరొకటి ఉండదు అని. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరీ ముఖ్యంగా మగవారు శరీర సౌష్టవం కోసం కానీ లేదా లైంగిక సామర్థ్యం పెంపొందడం కోసం కానీ చక్కటి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వారిలో యవ్వనంతో పాటు లైంగిక పటుత్వం బలపడుతుంది. లేదంటే జీవితంలో కొన్నిరకాల సమస్యలు, చేదు అనుభవాలు, చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మగవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాల్సిందే. 


టమాటాలు : 
లైంగిక పటుత్వం పెంపొందించడంలో టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఎన్నో జబ్బులతో పోరాడే శక్తి ఈ టమాటాల సొంతం. మరీ ముఖ్యంగా మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ని నివారించడంలో టమాటాలు కీలక పాత్ర పోషిస్తాయి.


బాదాం : 
గుండెకు, జీర్ణ వ్యవస్థకు, చర్మ సౌందర్యానికి బాదాం ఎంతో సహాయపడుతుంది. బాదాంలో కేలరీలు అధికంగా ఉంటాయి కనుక అవి తింటే అధిక బరువు పెరుగుతాం అనే భయంతో చాలామంది బాదాం పలుకులు తినాలంటే ఆలోచిస్తారు కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మగవారికి బాదాం ఎంతో మేలు చేస్తుంది. 


పాలు :
శరీర సౌష్టవం కోసం, కండరాల నిర్మాణం కోసం శ్రమించే మగవారు వ్యాయమం చేసిన తరువాత పాలు తాగితే మంచిది. ఈ భూ ప్రపంచంలోనే పాల కంటే మంచి ప్రొటీన్ ఫుడ్ మరొకటి లేదు అని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. 


చిలగడ దుంప : 
చక్కటి శరీర సౌష్టవం కోసం వ్యాయమం చేసే వాళ్లు వ్యాయమం తరువాత చిలగడ దుంపలు తినాలి. ఎందుకంటే చిలగడ దుంపల్లో అధిక మోతాదులో ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి శరీర పుష్టికి ఎంతో మేలు చేస్తాయి. 


పాల కూర : 
పచ్చటి ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరీ ముఖ్యంగా పాలకూరలో అధిక మోతాదులో ఫైబర్, క్యాల్షియంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచి, మంచి కంటి చూపుని ఇవ్వడంలో కీలక పాత్ర పోషించే బీటా కెరటోన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. 


ఉసిరి కాయలు : 
రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉసిరి కాయల్లో పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదల, చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతో ముఖ్యం.


ఇది కూడా చదవండి : Weight Loss Without Exercise: ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఈ బెస్ట్ హోమ్ రెమెడీస్‌తో మీ నడుమును జీరో సైజ్ చేసుకోండి..


వెల్లుల్లి : 
వెల్లుల్లి గుండెకు మేలు చేయడంతో పాటు హైబీపీని అదుపులోకి తీసుకొచ్చేందుకు, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించేందుకు సహాయపడుతుంది.


ఇది కూడా చదవండి : Haemoglobin: ఈ ఐదు కూరగాయలు డైట్‌లో ఉంటే, రక్తహీనత సమస్య ఇట్టే దూరం


(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి