High Bp Symptoms: ప్రస్తుతం చాలా మందిలో ఒత్తిడి, కోపం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అధిక రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడినప్పటికీ చాలా మంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో గుండెపోటు, మధమేహం బారిన కూడా పడుతున్నారు. అందుకే దీనిని చాలా మంది వైద్యులు 'సైలెంట్ కిల్లర్'గా కూడా పిలుస్తారు. శరీరంలో అధిక రక్తపోటు తీవ్ర తరం కావడం వల్ల కిడ్నీలు కూడా సులభంగా దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమస్యతో బాధపడేవారు తీసుకునే ఆహారాలు, శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అధిక రక్తపోటు రావడానికి ప్రధాన కారణాలు:
ఉప్పు కలిగిన ఆహారాలు అతిగా తీసుకోవడం:
ప్రస్తుతం లభించే స్ట్రీట్‌ఫుడ్స్‌లో ఉప్పు అధిక పరిమాణంలో ఉంటోంది. అయినప్పటికీ చాలా మంది విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా కూడా సులభంగా అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సిగరెట్ తాగడం:
సిగరెట్ తాగడం శరీరానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే..ప్రస్తుతం యువత సిగరెట్ తాగడం ఒక హాబీగా అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా దూమపానం చేయడం వల్ల కూడా అధిక రక్తపోటు సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. దీని కారణంగా కొందరిలో గుండెపోటు కూడా వస్తోందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
బరువు పెరగడం:
ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు పెరగడం కారణంగా అధిక రక్తపోటు సమస్య కూడా రావచ్చు. కాబట్ట శరీర బరువును నియంత్రించుకోవడం చాలా మంచిది.
శరీరక శ్రమ లేకపోవడం:
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగాలు చేసేవారు ఒకే చోట కూర్చుని పనులు చేస్తున్నారు. దీని కారణంగా శరీరక శ్రమ చాలా వరకు తగ్గింపోయింది. ఇలా శ్రమ తగ్గడం కారణంగా కూడా బీపీ సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
టెన్షన్:
అధిక రక్తపోటు సమస్య రావడానికి ప్రధాన కారణాల్లో టెన్షన్ కూడా ఓ లక్షణమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. టెన్షన్ కారణంగా మానసిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook