Haemoglobin: ఆధునిక బిజీ ప్రపంచంలో డైట్ సరిగ్గా ఫాలో అవని పరిస్థితి ఉంటుంది. డైట్ సరిగ్గా లేని కారణంగా శరీరంలో పలు లోపాలు ఉత్పన్నమౌతాయి,. రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ ఐదు కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి.
చిలకడదుంప ఎక్కువగా చలికాలంలో లభిస్తుంది. ఇందులో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉండటం వల్ల రక్తహీనత సమస్య పోతుంది.
పాలకూర శరీరంలో రక్త హీనత సమస్య ఉంటే పాలకూర తప్పకుండా తీసుకోవాలి. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం బాగుంటుంది. పాలకూర రోజూ తినడం వల్ల ఎనీమియా సమస్య తలెత్తుతుంది.
ఆనపకాయ ఆనపకాయ కూర తినడం వల్ల రక్త హీనత సమస్య తొలగిపోతుంది. ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.
క్యాబేజ్ క్యాబేజ్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి.
బీట్‌రూట్ హిమోగ్లోబిన్ పెంచేందుకు బీట్‌రూట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.