Benefits of Dates: ఖర్జూరం పళ్లు అన్నింటకంటే హై ప్రొటీన్డ్. అందుకే రోజూ క్రమ తప్పక తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు. రోజూ నిద్రపోయేముందు కేవలం రెండు ఖర్జూరం పళ్లు తింటే చాలు..ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడారి భూముల్లో పండే అద్భుతమైన దివ్యౌషధం ఖర్జూరం(Dates).చిన్నగా ఉన్నా సరే పండ్లలో హైలీ ప్రొటీన్డ్ పండు ఇదే. ప్రతిరోజూ ఖర్జూరం తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఖర్జూరంలో విటమిన్లు, ఐరన్, ప్రొటీన్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తి (Immunity Power) పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. అనేక వ్యాధుల్నించి కాపాడుతాయి. ప్రతిరోజూ డైట్‌లో తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా చాలా అదనపు లాభాలున్నాయి( Benefits of Dates). అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


రోగ నిరోధక శక్తి ( Immunity power): ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వీటిలో ఫ్లెవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఖర్జూరంలో ఉండే విటమిన్లు, ఐరన్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.


ఎముకలకు పటుత్వం ( Bone Strength) : ఖర్జూరంలో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎముకలు బలోపేతం అవడమే కాకుండా కండరాల సమస్య ఉంటే తగ్గుతుంది.


కళ్ల సమస్య( Eye problems): ప్రతి రోజూ ఖర్జూరం తినడం వల్ల కళ్లకు చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంటులో అధికంగా ఉండే విటమిన్ ఎ కళ్లకు చాలా మంచిది. ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల కంటి సమస్యల్ని తగ్గించుకోవడమే కాకుండా కళ్లను పూర్తి ఆరోగ్యంగా ఉంచుతాయి.


ఇతర ప్రయోజనాలు : ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యకరమైన గుండె కోసం ఖర్జురాలు చాలా మంచివి. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలను శారీరక బలహీనత, రక్తహీనత, గుండె జబ్బులను నయం చేస్తాయి. బరువు తగ్గడానికి సహయపడతాయి. ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తాయి. రోజూ ఖర్జురాలను తినడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇవి దోహదపడతాయి.


Also read: COVID-19 Dos And Donts: కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే ఏం చేయాలి, చేయకూడదో తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook