Stevia: చక్కెర కన్నా వంద రెట్లు తీయనైన సహజ స్వీటెనర్ ..స్టెవియా
Sugar plant:డయాబెటిస్ వచ్చినవారే కాకుండా ప్రస్తుతం చాలామంది చక్కెర తినాలంటేనే భయపడుతున్నారు. షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనేది ఒక కారణం అయితే వెయిట్ పెరుగుతామనేది మరొక కారణం. ఇలా తియ్యగా ఏదైనా తినాలన్న ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఏదో ఒక చిన్న ముక్క నోటిలో వేసుకొని సరిపెట్టుకునే వారు మనలో బోలెడు మంది. అలాంటి వారి కోసం తియ్యటి వార్త పంచదార కన్నా తియ్యగా ఉన్న ఈ మొక్క..
Diet sugar: మనలో చాలామంది కాఫీ దగ్గర నుంచి ఫ్రూట్ జ్యూస్ వరకు కాస్త చక్కెర కలుపుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. డయాబెటిస్ ఉన్నవారు సరే లేని వారు కూడా ఎక్కడ షుగర్ వస్తుందో అన్న భయంతో చక్కెరను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. మరికొంతమంది దీనికి బదులు మార్కెట్లో దొరికే ప్రత్యామ్నాయాలను వాడడానికి ప్రయత్నిస్తారు. కానీ అవి పూర్తిగా కెమికల్స్ తో నిండి ఉంటాయి కాబట్టి అలాంటివి వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఇలా తీపి అంటే ఇష్టం ఉన్న తినలేక ఇబ్బంది పడే వారికి ఓ చల్లని.. తీయటి కబురు.. ఏమిటంటే పంచదార కంటే వంద రెట్లు తియ్యగా ఉండే ఈ మొక్క ఉంది. డయాబెటిస్ పేషెంట్స్ దగ్గర నుంచి డైట్ ఫాలో అయ్యే వాళ్ళ వరకు ఎవరైనా ఈ జీరో క్యాలరీ ప్లాంట్ బెస్ట్ షుగర్ ని వాడవచ్చు. మీలో చాలామంది ఈ మొక్క గురించి వినే ఉంటారు..స్టెవియా.. దీన్నే తీపి తులసి అని కూడా పిలుస్తారు..అదే స్వీట్ బేసిల్ అండి.
ఆరోగ్య రీత్యా చక్కర ఎక్కువగా తీసుకోకూడదు అనుకునేవారు, అధిక బరువును నియంత్రించాలి అనుకునేవారు, చక్కెర వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అని భావించేవారు ఇలా ఎవరైనా సరే షుగర్ కి ప్రత్యామ్నాయంగా స్టెవియాను ఉపయోగించుకోవచ్చు. దీనితో కాఫీ ,టీ లాంటిదే కాకుండా పాయసం కూడా వండుకోవచ్చు.ఈ స్టెవియాను చక్కెరకు గొప్ప సహజ ప్రత్యామ్నాయం కాబట్టి షుగర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.
చూడడానికి అచ్చం తులసి చెట్టులా ఉండే ఈ చెట్టు ఆకులు షుగర్ కంటే 100 రెట్లు తీయగా ఉంటాయి అని అంటారు. అయితే ఇందులో చక్కెరలో ఉన్నట్టుగా కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ,ఇతర కృత్రిమ పదార్థాలు ఏమీ ఉండవు. ఈ మొక్క దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో లాంటి ప్రాంతాలలో విరివిగా పెరుగుతుంది. అయితే ప్రస్తుతం దీన్ని మనదేశంలో కూడా అక్కడక్కడ టెర్రస్ గార్డెన్ లో పెంచుతున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఈ చక్కెర మొక్కను పెంచుకోండి.
గమనిక: పైన అందించిన సమాచారం నిపుణుల సూచన మేరకు సేకరించడం జరిగింది. మీరు ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు
Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook