ఉసిరి ( Amla ) తినడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. నిజానికి దాని రుచి కన్నా... దాని వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుంటే మీ దైనందిన జీవితంలో ( Lifestyle ) ఉసిరి వాడకాన్ని మీరు వెంటనే పెంచుతారు. ఉసిరిని మిరాకిల్ ఫ్రూట్ అంటే అద్భుతమైన పండు అంటారు. ఎన్నో వ్యాధులకు ఇది రామబాణం లాంటిది. హిందు పౌరాణికాల ప్రకారం మనిషి శరీరం నుంచి వ్యాధులను తరిమికొట్టే ఎన్నో ఔషధగుణాలు ఉసిరిలో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Video: మాస్కు వేసుకోవడం మనం చేసే సాధారణ తప్పులపై WHO వీడియో 


ఉసిరి వల్ల లాభాలు ఇవే...
తెలుగు రాష్ట్రాల్లో ఉసిరిని పచ్చడి చేసుకోవడం మనం చూస్తుంటాం. ఇది మన పూర్వికుల నుంచి మనకు వచ్చిన మంచి ఆహారపు అలవాటు ఇది. ఉసిరితో జామ్ లేదా చట్నీ కూడా చేస్తుంటారు. ఇలా వివిధ రకాలుగా ఉసిరిని తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆరోగ్యకరమైన ( Health ) జీవితం మీ సొంతం అవుతుంది.


- నల్లని జుట్టు కావాలి అనుకుంటే ఉసిరి తినడం ప్రారంభించండి.


- పంటి నొప్పి ఉందా..అయితే ఉసిరిని ట్రై చేయండి. అలాగే కంటి సమస్యలకు కూడా మంచిది.



ALSO READ|  Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!


- కొంత మందికి కళ్లు పచ్చరంగులో మారుతుంటాయి. ఉసిరి వల్ల అది తగ్గుతుంది. కంటికి చల్లదనం కలిగిస్తుంది.


- కనుపాపలపై ఉసిరి రసాన్ని అప్లై చేస్తే కంటి నొప్పి తగ్గుతుంది.


- నోటి పూత సమస్య ఉన్నవాళ్లు ఉసిరి తీసుకోవడం మంచిది.


- ఉసిరి తరచూ తీసుకోవడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి ( Immunity )పెరుగుతుంది. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR