రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే ( An Apple A Day Keeps Doctor Away ) అవసరం రాదు అంటారు.  యాపిల్ వల్ల ఆరోగ్యం ( Health ) మెరుగు అవుతుంది అంటారు. అలాగని యాపిల్స్ ను ఎక్కువగా తింటే కొన్ని నష్టాలు కూడా కలగవచ్చు. నిజానికి ఎవరికైనా అనారోగ్యం చేస్తే వెంటనే వారికి యాపిల్స్ తినిపిస్తారు. చాలా మంది డాక్టర్లు కూడా యాపిల్స్ ను తినమని చెబుతారు.



అయితే అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం యాపిల్ వల్ల పాంక్రియాస్ కేన్సర్ ( Pancreas Cancer ) తో పాటు అనేక అనారోగ్యాలు  తగ్గుతాయట. ఇలాంటి ఎన్నో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.


1. కుటుంబంలో ఎవరికైనా ఎలర్జీ ఉంటే.. యాపిల్ నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఎందుకంటే యాపిల్ స్కిన్ పై ఉండే వ్యాక్స్ వల్ల ఎలర్జీ సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం ఉంది. వ్యాక్స్ లో ( Wax )ఉండే సర్ఫర్ డైయాక్సైడ్ వల్ల గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


2. యాపిల్ ను (Apple ) పండించేందుకు చాలా మంది క్రిమి సంహారక మందులను ఎక్కువగా వాడతారు. ఈ పెస్టిసైడ్స్ వల్ల శరీరానికి ఎంతో హాని కలిగే అవకాశం ఉంది. 



3. యాపిల్  విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. యాపిల్ సీడ్స్ కడుపులోకి వెళ్తే ఆనారోగ్యం.. కొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఒకటి రెండు విత్తనాల వల్ల అంతగా నష్టం కలగకపోయినా... దీర్ఘకాలికంగా వాటివల్ల సమస్యలు వస్తాయి. కడుపులో నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. యాపిల్ విత్తనాలు తినడం వల్ల శరీరంలోకి విషం చేరుతుంది. యాపిల్ విత్తనాల్లో ఉండే అధిక శాతం అమిగ్డాలిన్ వల్ల శరీరంలో ఆక్సిజన్ సమతుల్యం చెడిపోతుంది. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల కొన్ని నిమిషాల్లో మరణం సంభవించే అవకాశం ఉంది.



ఇకపై యాపిల్స్ తినే ముందు ఈ విషయాలు గుర్తుంచుకుంటారు అని ఆశిస్తున్నాం.


 


తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్  వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR