Vastu and Health: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే వాస్తుదోషాలు తొలిగి ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుంది

ఈ మొక్కలను మీరు మీ ఇంట్లో పెంచితే ఆనారోగ్యాల నుంచి మీ కుటుంబం దూరంగా ఉంటుంది. దాంతో పాటు వాస్తు దోషాలు తొలిగిపోతాయి.

Last Updated : Sep 11, 2020, 03:06 PM IST
    • ఈ రోజుల్లో చాలా మంది ఎయిర్ ప్యూరిఫై (Air Purifier ) అంటే గాలిని శుద్ది చేసే మొక్కలను తమ ఇంట్లో పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
    • వాటికి నీరు కూడా అంతగా అవసరం ఉండదు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి.
Vastu and Health: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే వాస్తుదోషాలు తొలిగి ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుంది

ఈ రోజుల్లో  చాలా మంది ఎయిర్ ప్యూరిఫై (Air Purifier ) అంటే గాలిని శుద్ది చేసే మొక్కలను తమ ఇంట్లో పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. వాటికి నీరు కూడా అంతగా అవసరం ఉండదు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అంత ఖరీదైనవి కూడా కాదు. దాంటో పాటు చాలా మంది తమ ఇంట్లో బోన్సాయ్ చెట్లు అంటే మరగుజ్జు చెట్లు పెంచడానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ ఆరోగ్యంతో ( Health ) పాటు వాస్తు దోషాలు తొలగాలి అంటే మాత్రం ఈ మొక్కలు పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

1. తులసి  ( Basil )
 ఇంట్లో విదేశీ మొక్కలు పెంచడానికి బదులుగా తులసి (Basil Plant )మొక్కలను పెంచండి. అయితే వీటిని చిన్న చిన్న కుండీల్లో కాకుండా... కాస్త పెద్ద కుండీల్లో పెంచడండి. లేదంటే అవి త్వరగా ఎండిపోతాయి. తులసి మొక్క వేరు విస్తరించాలి. అప్పుడే అది ఆరోగ్యకరంగా పెరుగుతుంది. రోజుకు రెండు సార్లు నీరు పోయండి. తులసి చెట్టు ఇంటి వాతావరణాన్ని శుధ్ది చేస్తుంది. సూక్ష్మ క్రిముల బరి నుంచి ఇంటిని దూరంగా ఉంచుతుంది. తులసి చెట్టును ఎప్పుడూ తూర్పు వైపు మాత్రమే ఉంచండి.

2.  బ్రహ్మీ ( Brahmi)
ప్రతీ ఇంట్లో బ్రహ్మీ చెట్టు ఉండాలి అని పూర్వికులు తెలిపారు. దీనికి తులసి చెట్టుకు పోసేంత నీరు కూడా అవసరం లేదు. మాససిక ఆరోగ్యం కోసం బ్రహ్మీ చెట్టు చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి కూల ఆలోచనలు అంటే నెగెటివ్ థాట్స్ ( Negative Thoughts ) ను నిర్మూలిస్తుంది.  భూమి పుట్టినప్పుటి నుంచి ఈ మొక్క ఉన్నట్టు చెబుతుంటారు.  ఇందులో ఎన్నో గుణాలు ఉంటాయి.  ఇది పిల్లల్లో హైపర్ టెన్షన్ ను దూరం చేస్తుంది. దాంతో పాటు నర్వస్ సిస్టమ్ కు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. ఎముకలను పటిష్టం చేస్తుంది. దాంతో పాటు మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. బ్రహ్మీ చెట్టుతో మీరు డికాషన్ కూడా చేసుకోవచ్చు. అందుకే అందంగా కనిపించే మొక్కల కన్నా బ్రహ్మీ చెట్టును పెట్డడం చాలా మంచిది.

3. బిల్వపత్రి చెట్టు ( Bilwa Tree )
బిల్వపత్రి చెట్టు ఆకులు, వేరు, పండ్లు అన్ని పవిత్రమైనవి. బిల్వ చెట్టు భూమిని చల్లబరుస్తుంది. దీంతో ఆ మహశివుడు కూడా సంతోషిస్తాడు. ఆయన కరుణ మీపై సదా ఉంటుంది. బిల్వ పత్రి చెట్టు సంవత్సరానికి 56 టన్నుల ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

4. సీత ఆశోక చెట్టు (Ashoka Tree )
అశోక చెట్టును యాంటీ డిప్రెసెంట్ చెట్టు అంటారు.  అశోక వనంలో ఆ చెట్టు ఉండటం వల్లే సీతామాత అన్ని రోజులు శ్రీలంకలో ఉండగలిగారు అంటారు.  అశోక చెట్టు నీడ చాలా మంచిది. అది పాజిటీవ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఈ చెట్టు గైనకాలజీ ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులకు చాలా ఉపయోగపడుతుంది.

 

Trending News