Home Remedies For High BP: హై బీపీతో బాధపడేవారికి హార్ట్‌ ఫెయిల్యూర్‌, స్ట్రోక్‌, కిడ్నీ స్టోన్స్‌, చూపు మందగించడం, మతిమరుపు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ బ్లడ్‌ ప్రెజర్‌ పెరిగినందున వస్తాయి. హైబీపీ తగ్గించే 5 చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. హై బీపీతో ఎక్కువ కాలం పాటు బాధించపడుతున్నవారు ఆర్టెరీ సమస్యలు కూడా వెంటాడుతాయి. దీనివల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. బ్లడ్‌ ప్రెజర్‌ నిర్వహణలో ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిండచడం ఎంతో అవసరం. దీనివల్ల అతిగా మందులు కూడా తీసుకోకుండా ఉండవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోషక ఆహారాలు తినండి..
మీ డైట్లో పోషక ఆహారాలు ఉండే చూసుకోండి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా లో శాచురేటెడ్‌ ఆహారాలు బీపీని తగ్గిస్తాయి. ముఖ్యంగా విటమిన్స్‌, మినరల్స్‌, ప్రొటీన్‌, ఫైబర్, పొటాషియం, క్యాల్షియం ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి బీపీ తగ్గిస్తాయి.


ఎక్సర్‌సైజ్‌..
తరచూ ఎక్సర్‌సైజు చేయడం వల్ల కూడా బీపీ తగ్గుతుంది. అయితే, ఒకవేళ మీరు బీపీ హఠాత్తుగా పెరుగుతుంటే మాత్రం ఎక్సర్‌సైజ్‌ ఆపడం మేలు. సాధారణంగా ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నప్పుడు 5-8 ఎంఎం బీపీ స్థాయిలు తగ్గిపోతాయి.  ప్రతిరోజూ ఓ అరగంట ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల బీపీ స్థాయిలను నిర్వహించవచ్చు.


ఇదీ చదవండి: టీ తాగుతూ ఈ 5 ఫుడ్స్‌ తింటున్నారా? మీరు తప్పు చేస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త..


వెయిట్‌..
బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు బరువు పెరగకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగుండా ఉంటాయి. మీరు ఏ కాస్త బరువు తగ్గినా బీపీ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. బరువు తగ్గడానికి ఏమాత్రం ప్రాక్టీస్‌ చేసినా బీపీ స్థాయిలు తగ్గుతాయి.


మంచి నిద్ర..
మీకు నిద్ర లేమి సమస్యతో బాధపడుతుంటారు. బీపీ ఉన్నప్పుడు కనీసం ఏడు గంటలు అయినా నిద్రపోవాలి. బీపీ సమస్య ఉన్నవారు మంచి నిద్ర రావడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రకు సరైన షెడ్యూల్‌ చేసుకోవాలి. కనీసం ఎనిమిది గంటలు అయినా నిద్ర పోతే ఆరోగ్యానికి మంచిది.


ఇదీ చదవండి: కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించే గోరుచిక్కుడు.. వారానికి ఒక్కసారైనా తింటున్నారా?


ఉప్పు..
బీపీతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తినాలి. హై బీపీతో బాధపడుతున్నవారు ఉప్పు తక్కువ తీసుకోవాలి. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల మీ గుండె కూడా బలంగా మారుతుంది. ఇది హై బీపీ స్థాయిలను కూడా తగ్గిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి