Cluster Beans: కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించే గోరుచిక్కుడు.. వారానికి ఒక్కసారైనా తింటున్నారా?

Cluster Beans Health Benefits: ఇది కూడా ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ. ఇది చిక్కుడు జాతికి చెందినది. మనం ఎక్కువగా చిక్కుడు కాయ, బీన్స్‌ వంటివి తీసుకుంటాం. కానీ, చాలా వరకు గోరు చిక్కుడు కూరగాయను చాలామంది తక్కువగా తింటారు. కానీ, ఈ కూరగాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం విటమిన్ సి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. 
 

1 /5

ముఖ్యంగా చాలామంది మహిళలు ఐరన్‌ లేమితో బాధపడుతుంటారు. దీంతో వారు బలహీన సమస్యతో బాధపడుతుంటారు. అందుకే గోరుచిక్కుడు మహిళలకు వరం. దీన్ని కనీసం వారంలో ఒకటి రెండుసార్లైనా తినాలి. దీంతో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. ఇనుము లేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.  

2 /5

మన దేశంలో చాలామంది డయాబెటీస్‌, బీపీతో బాధపడుతుంటారు. వారు కచ్చితంగా వారానికి ఒక్కసారైనా గోరుచిక్కుడు తినాలి. ముఖ్యంగా హై బీపీతో బాధపడేవారికి గోరు చిక్కుడు ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఇది ఆరోగ్యానికి మంచిది.  అంతేకాదు గుండె జబ్బులు, డయాబెటీస్‌ ఉన్నవారు కూడా గోరుచిక్కుడు తినాలి.   

3 /5

అంతేకాదు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు కూడా గోరుచిక్కుడు ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఇందులో ఫోలెట్‌ ఉంటుంది. ఇది పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ సమయంలో మహిళలకు ఐరన్ ,కాల్షియం కూడా అందిస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో గోరుచిక్కుడు తినాల్సిందే.  

4 /5

గోరుచిక్కుడు తినేవారిలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ కూరగాయ ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే ఫాస్పరస్ ,క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. అందుకే ఈ కూరగాయ పిల్లలకు పెట్టండి.   

5 /5

కొలెస్ట్రాల్‌ను కూడా ఈజీగా తగ్గించేస్తుంది గోరుచిక్కుడు అందుకే ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి గోరుచిక్కుడు బెస్ట్‌ రెమిడీ. గోరుచిక్కుడులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటటానికి సహాయపడుతుంది. గోరుచిక్కుడులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )