Digestive problems: భోజనం చేసేటప్పుడు చేయకూడని ప్రధాన తప్పులివే
Digestive problems: భోజనం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఎదురౌతుంటాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే..గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావల్సింది జీర్ణక్రియ సరిగ్గా ఉండటం. జీర్ణక్రియ బాగుంటే చాలా రకాల వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. ఆహారపు అలవాట్ల కారణంగా జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఫలితంగా కడుపు పాడవడం, అజీర్తి, మలబద్ధకం, ఎసిడిటీ, బ్లోటింగ్ సమస్యలు ఎదురౌతాయి. జీర్ణక్రియపై ప్రభావం చూపించే ఆ తప్పులేంటో తెలుసుకుందాం..
భోజనం తరువాత నీళ్లు తాగడం
చాలామంది భోజనం చేసేటప్పుడు లేదా చేసిన తరువాత చాలా నీళ్లు తాగేస్తుంటారు. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటుంటే వెంటనే మానుకోవాలి. ఎందుకంటే దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. నీరు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే భోజనానికి 10-15 నిమిషాల తరువాతే నీళ్లు తాగాలి.
త్వరగా తినడం
చాలామంది వేగంగా తింటుంటారు. త్వరగా తినాలనే కంగారులో సరిగ్గా నమలకుండా మింగేస్తుంటారు. దాంతో జీర్ణక్రియ కష్టమౌతుంది. ఇది గ్యాస్, స్వెల్లింగ్ సమస్యలకు దారితీస్తుంది. భోజనం నెమ్మది నెమ్మదిగా నమిలి తినాల్సి ఉంటుంది.
పరగడుపున టీ లేదా కాఫీ
పరగడుపున టీ లేదా కాఫీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉత్పన్నమౌతాయి. టీ లేదా కాఫీలో ఉండే కెఫీన్ అజీర్తికి కారణమౌతుంది. ఒకవేళ మీకు కడుపు లేదా ఛాతీలో మంట, వాంటింగ్ సెన్సేషన్, గ్యాస్ ఉంటే పరగడుపున టీ, కాఫీ తాగడం మానేయాలి.
తినేటప్పుడు మన శరీరం పొజీషన్ సరిగ్గా ఉండాలి. ఎందుకంటే దీని ప్రభావం జీర్ణక్రియపై పడుతుంది. తినేటప్పుడు నడుస్తూ తిరుగుతూ తినకూడదు. ఓ కాలు మడతపెట్టి కూర్చుని తింటే బాగా అరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. జీర్ణక్రియ బాగుంటుంది.
నీళ్లు తక్కువ తాగడం
జీర్ణక్రియ బాగుండాలంటే నీళ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. శరీరంలో నీటి కొరత కారణంగా భోజనం కఠినమైపోతుంది. జీర్ణక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయి. డీహైడ్రేషన్, డయేరియా సమస్య ఏర్పడుతుంది.
Also read: Thyroid Weight Loss: ఈ డైట్‌తో థైరాయిడ్ ఉన్నవారు 15 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook