Hair Growth Tips: జుట్టు రాలిపోకుండా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లు ఉండాలి. జుట్టు పెరగటానికి ప్రత్యేకించి ఆహారమేదీ ఉండకపోవచ్చు. కానీ కొన్ని పోషకాలు వెంట్రుకలకు మేలు చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి లభించే పదార్థాలను తెలుసుకొని, ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతైనా మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టు నిగనిగలాడాలంటే


ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను మన శరీరం తయారుచేసుకోలేదు. వీటిని ఆహారం లేదా మాత్రల రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జబ్బులు రాకుండా కాపాడటమే కాదు.. జుట్టు పెరగటానికి, నిగనిగలాడటానికీ అవసరమే. సాల్మన్‌, సార్‌డైన్‌, మాకెరల్‌ వంటి చేపల్లో ఇవి దండిగా ఉంటాయి. 


జట్టు ఎదుగుదల కోసం


వెంట్రుకల ఆరోగ్యానికి ప్రొటీన్‌ అత్యవసరం. ఇది పెరుగులో దండిగా ఉంటుంది. అంతేకాదు.. మాడుకు రక్త సరఫరా మెరుగుపడటానికి, వెంట్రుకలు పెరగటానికి తోడ్పడే విటమిన్‌ బి5 (పాంటోథెనిక్‌ యాసిడ్‌) కూడా ఉంటుంది. ఇది వెంట్రుకలు పలుచబడకుండా, ఊడిపోకుండా కాపాడుతుంది.


జట్టు పటుత్వానికి


చాలా ఆకుకూరల్లో మాదిరిగానే పాలకూరలోనూ బోలెడన్ని పోషకాలుంటాయి. విటమిన్‌ ఎ దండిగా ఉంటుంది. ఐరన్‌, బీటా కెరొటిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ సి సైతం ఉంటాయి. ఇవన్నీ కలిసి మాడు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. వెంట్రుకలు పెళుసుబారకుండా, చిట్లిపోకుండా కాపాడతాయి.


హెయిర్ డామేజ్ కాకుండా..


పండ్లలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. వెంట్రుకలు చిట్లకుండా, విరిగిపోకుండా చూడటానికిది తోడ్పడుతుంది. ఒక కప్పు జామ పండ్ల ముక్కలతో 377 మి.గ్రా. విటమిన్‌ సి లభిస్తుంది. ఇది మన రోజువారీ అవసరాల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ!


జుట్టుకు సరైన రక్తప్రసరణ


దాల్చిన చెక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్‌, పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఫలితంగా జట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 


జట్టు ఊడకుండా..


శరీరంలో తగినంత ఐరన్‌ తీసుకోకపోయినా జుట్టు ఊడిపోవచ్చు. మాంసాహారంలో.. ముఖ్యంగా కాలేయం వంటి అవయవాల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. ఆకు కూరలతోనూ లభిస్తుంది. ప్రస్తుతం ఐరన్‌ను కలిపిన పదార్థాలూ అందుబాటులో ఉంటున్నాయి.


జుట్టు పొడిబారకుండా..


చిలగడ దుంపల్లో బీటా కెరొటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. దీన్ని మన శరీరం విటమిన్‌ ఎగా మార్చుకుంటుంది. ఇది జట్టు పొడిబారటాన్ని అరికడుతుంది. నిగనిగలాడినట్టు కనిపించేలా చేస్తుంది. క్యారెట్‌, గుమ్మడి, మామిడిపండ్లతోనూ బీటా కెరొటిన్‌ లభిస్తుంది.


దట్టంగా ఎదగాలంటే


వెంట్రుకలన్నీ ఎప్పుడూ ఒకేలా పెరగవు. కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటాయి. తగినంత ప్రొటీన్‌ అందకపోతే వెంట్రుకలు ఈ దశలోనే ఉంటాయి. అదే సమయంలో పాత వెంట్రుకలు రాలిపోతుంటాయి. మాంసంలో ప్రొటీన్‌ ఉంటుంది కానీ సంతృప్తకొవ్వు ఎక్కువ. అదే చికెన్‌తో తక్కువ సంతృప్తకొవ్వుతోనే మంచి ప్రొటీన్‌ లభిస్తుంది. ఇక గుడ్లలోని బయోటిన్‌ వెంట్రుకలు పెరగటానికి తోడ్పడుతుంది. 


Also Read: High BP remedy: బీపీ ఉన్నవారికి హెచ్చరిక.. చలికాలం ఇలా జాగ్రత్త పడండి..!


Also Read: Omicron Symptoms: ఒమిక్రాన్ సోకిన వారిలో కొత్త లక్షణాలు.. కళ్లు ఎర్రగా మారడం, జుట్టు రాలడం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి