Summer Care: వేసవికాలం వచ్చేసింది. ఇంకా మే కూడా రాలేదు కానీ..బయట మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే.. మైక్రోవేవ్ ఓవెన్ లోకి వెళుతున్న అనుభూతి కలుగుతోంది. బయట ఎండ తారాస్థాయికి చేరుకుంటూ ఉండటంతో.. ఈ ఎండలో మనం ఎక్కువగా తిరిగితే.. అది మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు, గుండెపోటు వంటివి రాకుండా వేసవికాలంలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇందుకోసం పాటించవలసిన జాగ్రత్తలు ఏవో ఒకసారి చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుదిరినప్పుడే కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇలా చేసుకోవడం వల్ల, ఎండలోతిరగడం వల్ల మన ఆరోగ్యం ఎలాంటి ప్రమాదానికి గురవుతుందో ముందే అంచనా వేయొచ్చు. 


వీలైనంతవరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట లేదా ఎండ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు..కుదిరినంతవరకు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ ఇప్పటికే అంతర్లీనంగా మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన గుండె మీద ఒత్తిడి ఇంకా పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.


సమ్మర్ లో అన్నిటికంటే కావాల్సింది హైడ్రేషన్. మన శరీరంలో ఉన్న నీటి శాతాన్ని ఎండ తగ్గించేస్తూ ఉంటుంది. కాబట్టి మన శరీరం హైడ్రేట్ అవ్వడానికి మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రాబెరీలు, పుచ్చకాయ, పీచ్ వంటి ఫ్రూట్స్ కీర దోసకాయ వంటి కూరగాయలు మన డైట్ లో యాడ్ చేసుకోవాలి. అవసరమైన ద్రవాలను కూడా తీసుకుంటూ ఉంటే గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. 


మన శరీరం మీద మనమే దృష్టి పెట్టాలి. అసలే వేసవికాలం కాబట్టి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన శరీరం అలాంటి సంకేతాలు ఇస్తుందా అని తెలుసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా చెమట పడుతున్న కడుపులో వికారంగా ఉన్నా హృదయం వేగంగా కొట్టుకుంటున్నా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ఉత్తమం. కుదిరినంతవరకు ఎండలోకి వెళ్లి పని చేయడం మానుకోవాలి. ఒకవేళ ఎండలోకి వెళ్లాల్సి వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మంచి నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం మంచిది. 


ఒత్తిడి తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. వేసవికాలంలో ఉండే వేడి మన గుండెఆరోగ్యం పై బాగా ప్రభావం చూపుతుంది అని కొన్ని వైద్య అధ్యాయనాలు కూడా చెప్పుకొచ్చాయి. అందుకే మనం ఒత్తిడి తగ్గించే పనులు చేయాలి. ఉదాహరణకు యోగా చేయడం, ధ్యానం చేయడం, లేదా సాయంత్రం పూట కొంచెం దూరం నడవడం ఇలాంటి ప్రశాంతమైన పనులు చేసినా లేదా మనకి నచ్చిన వారితో సమయం గడిపినా ఒత్తిడి తగ్గి గుండె నాళ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది.


Also Read: Anantapur Navodaya Old Students: మీరు నిజంగా గ్రేట్.. గురుదక్షిణగా రూ. 12 లక్షల కారు..


Also Read: Glass Symbol: జనసేన పార్టీకి గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు 'గాజు గ్లాస్‌' గుర్తు కేటాయింపు
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook