How To Wear Mask: మాస్క్‌లు ధరించే సరైన విధానం మీకు తెలుసా?
Tips To Wear Mask:కరోనావైరస్ సంకోభం ( Coronavirus ) వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అయితే కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization ) పలు సూచనలు జారీ చేసింది.
Right Way to Wear Face Mask: కరోనావైరస్ సంకోభం ( Coronavirus ) వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అయితే కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization ) పలు సూచనలు జారీ చేసింది. ఇందులో భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత అంశాలతో పాటు మాస్క్‌ను సరైన విధానంలో ధరించడం, తొలగించడం ఎలాగో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనావైరస్ నుంచి మనల్ని, ఇతరులను రక్షించే మాస్క్ ఎలా ధరించాలో కొన్ని పాయింట్స్‌లో చదవండి. Also Read :Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే
Proper Way To Wear Face Mask : మాస్క్ ధరించే పద్ధతులు:
-
మాస్క్ ధరించడానికి ముందు మీ చేతులను సబ్బుతో శుభ్రం ( Hand Wash ) చేసుకోండి. సబ్బు అందుబాటులో లేదనుకుంటే లిక్విడ్ హ్యాండ్ ( Liquid Hand Wash ) వాష్ లేదా పొటాషియం ఫర్మాంగనేట్ కలిపిన నీటితో కడకగండి. అప్పుడే మాస్క్‌ను ధరించండి
-
మాస్క్ మీ ముక్కు, నోటి భాగాన్ని సరిగ్గా కప్పేలా ( Cover Face and Nose ) చూసుకోండి. ఎలాంటి ఖాళీలు లేకుండా చూసుకోండి. అలాంటి మాస్క్‌లు మాత్రమే ధరించండి
-
మాస్క్ ధరించిన తరువాత చేతిని మాస్క్‌కు టచ్ చేయకండి.
-
మాస్క్ తడిస్తే దాన్ని వినియోగించకండి. తడి ముసుగుల వల్ల ప్రమాదం అధికం అవుతుంది
ఈ చిట్కాలు పాటించి మీ మాస్క్‌ను జాగ్రత్తగా ధరించవచ్చు. దాంతో మీరు, మీ కుటుంబం కోవిడ్-19 సంక్రమణ నుంచి దూరంగా ఉంటుంది.