Best Breakfast Foods: అందుకే కరోనా మహమ్మారి సమయం నుంచే రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాల్ని ప్రతి ఒక్కరూ అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి వ్యాధి  కూడా దరిచేరదు. సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ అయితే ముందే దూరమైపోతాయి. మరి ఈ ఇమ్యూనిటీని పటిష్టం చేసేందుకు అత్యుత్తమమైన ఆహార పదార్ధాలేంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది యాధృఛ్చికమో లేదా పూర్వీకులు తెలిసి చేశారో గానీ ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల కిచెన్ మాత్రం పోషక పదార్ధాలతో సమృద్ధిగా ఉంటుంది. మనం తినే వివిధ రకాల పదార్ధాలు, మసాలా దినుసుల్లో ఇమ్యూనిటీని అమాంతం పెంచేవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చినచెక్క, లవంగాలు ఇలా చాలానే ఉంటాయి. అదే సమయంలో భారతీయులు ఇష్టంగా తినే వివిధ రకాల అల్పాహార పదార్ధాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా ఉంటాయి. వీటితో పాటు ఫైబర్, ప్రోటీన్లు, ఫ్యాట్ కావల్సిన పరిమాణంలో లభిస్తాయి. దాంతో ఇమ్యూనిటీ శరవేగంగా పెరుగుతుంది. శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది. అలాంటి బ్రేక్‌ఫాస్ట్ పదార్ధాల్లో కొన్ని మీ కోసం..


వోట్స్


అద్బుతమైన అల్పాహారంగా చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇష్టంగా తినే అల్పాహారం కూడా. ఇందులో ఉండే బీటా గ్లూకోన్ వ్యాధిని ఎదుర్కొనే సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇందులో  ఉండే సెలీనియం, జింక్ మూలకాలు వ్యాధుల సంక్రమణను, సీజనల్ వ్యాధుల ముప్పును నివారిస్తాయి.


పోహా


ఇక ఉత్తర భారతదేశంలో ఎక్కువగా, ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఇది. రెడ్ రైస్‌తో చేసే పోహా అత్యంత శక్తివంతమైంది. ఇందులో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మెటబోలిజం వేగవంతం చేస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచదు. 


హోమ్ మేడ్ గ్రానోలా


నట్స్, సీడ్స్ ఎక్కువగా ఉండే పాలతో చేసే బ్రేక్‌ఫాస్ట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో ఇమ్యూనిటీ బలోపేతమౌతుంది. హెల్తీ వెయిట్ లాస్‌కు అద్భుతంగా సహాయపడుతుంది. 


ఇడ్లీ, దోశ


పులియబెట్టిన పిండి, మినపతో చేసే బ్రేక్‌ఫాస్ట్ గట్ సమస్యకు చాలా మంచిది. అంతేకాకుండా బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థకు తోడ్పడుతుంది. వేడి వేడి సాంబారుతో తింటే మరింత ప్రయోజనకరం. రుచి కూడా. దక్షిణాదిన అమితంగా ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ ఇది. ఇతర దేశాల్లో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. కారణం రుచితో పాటు ఇందులోని పోషక విలువలు. 


గుడ్లు


ఉత్తరాదిలో బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఎక్కువగా ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటారు. ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచేందుకు అద్భుతమైన పదార్ధం. 


నట్స్ అండ్ సీడ్స్


హెల్తీ ఫుడ్ ఇది. ఇందులో కొవ్వు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా కావల్సిన పరిమాణంలో ఉంటుంది. దాంతో శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరిగి..ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు దోహదపడతాయి.


Also read: Health Tips: ప్రోసెస్డ్ లేదా ప్యాక్డ్ మాంసం ఎందుకు తినకూడదో తెలుసా, దుష్పరిణామాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook