Health benifits of cinnamon: దాల్చిన చెక్క... సుగంధ ద్రవ్యాల రారాజుగా దీనికి పేరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని శతాబ్దాలుగా ఈ సుగంధ ద్రవ్యం వాడుకలో ఉంది. మధ్య యుగాల కాలంలో దగ్గు, గొంతు నొప్పి, గొంతు బొంగురుకు దీన్ని ఔషధంగా ఉపయోగించేవారు. ఒకప్పుడు కరెన్సీ గానూ దీన్ని వినియోగించినట్లు చెబుతారు. దాదాపుగా ప్రతీ వంటింట్లో ఉండే ఈ దాల్చిన చెక్కతో (Cinnamon) ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సంరక్షణకు, బీపీ, డయాబెటీస్ (Diabetes) వంటి దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు దాల్చిన చెక్క మంచి ఔషధంలా పనిచేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు : 0.1గ్రా ప్రోటీన్, 0.8గ్రా కార్బోహైడ్రేట్, 1.4గ్రా ఫైబర్, 26 మి.గ్రా కాల్షియం


దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాలు : యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ (Anti bacterial), యాంటీ ఫంగల్ ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. దంత క్షయాన్ని నిరోధించడంలో ఈ ఔషధ గుణాలు బాగా పనిచేస్తాయి. వంటల్లో దీన్ని వేయడం ద్వారా మంచి సువాసన రావడంతో పాటు అవి ఎక్కువసేపు నిల్వ ఉంటాయి. ముఖ్యంగా మాంసాహారం చెడిపోవడానికి కారణమయ్యే బాక్టీరియాను దాల్చిన చెక్క నిరోధించగలదు. అందుకే మాంసాహార వంటల్లో (Nonveg) దీన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు.


ప్రీబయాటిక్ లక్షణాలు : దాల్చినచెక్కలో ఉండే ప్రీబయాటిక్ లక్షణాలు శరీరానికి మంచి చేసే బాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతాయి. అదే సమయంలో చెడు బాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి. దాల్చిన చెక్కలో (Cinnamon) పుష్కలంగా ఉండే పాలిఫినాల్స్‌ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి అర్థరైటిస్ వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది.


బీపీ నియంత్రణ : బీపీని (Blood Pressure) నియంత్రించడంలోనూ దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. నైట్రిక్ యాక్సైడ్ విడుదల ద్వారా రక్త నాళాల్లో రక్త ప్రవాహం మరింత మెరుగ్గా ఉంటుంది. అయితే బీపీ సమస్య ఉన్నవారు వైద్యుల సూచన మేరకే దీన్ని వాడాల్సి ఉంటుంది.


సుగర్ కంట్రోల్ : టైప్ 2 డయాబెటీస్ (Diabetes) నియంత్రణలో దాల్చిన చెక్క మితమైన ప్రభావాన్ని చూపగలదు. అయితే దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. దీన్ని నిర్దారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. 2019లో వెల్లడైన ఓ అధ్యయనం రోజుకు 3-6గ్రా. దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా బ్లడ్ సుగర్‌ను నియంత్రించవచ్చునని వెల్లడించింది.


Also Read: Lizard: 7వేల కి.మీ ప్రయాణించిన బల్లి... ఎలా సాధ్యమైందంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook