Dietary Changes in Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో చేయాల్సిన మార్పులు

డయాబెటిస్ తో బాధపడే వారు తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. కింద పేర్కొన్న నియామాలను పాటిస్తే మీ శరీరంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థితిలో ఉండటమే కాకుండా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 07:45 PM IST
Dietary Changes in Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో చేయాల్సిన మార్పులు

Dietary Changes in Diabetes: డయాబెటిస్ లేదా మధుమేహాం అనగా శరీరంలో ఉండే గ్లూకోజ్ - శక్తిగా మార్చబడటం లేదని అర్థం. దీనికి గల కారణం శరీరంలో సరైన స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి చెందటం లేదని లేదా ఉత్పత్తి చెందిన ఈ హార్మోన్ శరీరంలో వినియోగపడటం లేదని అర్థం. ఈ వ్యత్యాసాల వలన శరీరంలో గ్లూకోజ్ వినియోగం చెందదు. టైప్-1 మధుమేహంలో శరీరంలో, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు స్వతహాగా నాశనం చెందించబడతాయి. ఈ విధంగా ఇన్సులిన్ లోపాల వలన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి.

టైప్-1 డయాబెటిస్ కు గురైన వారు రోజు ఇన్సులిన్ ను శరీరంలోకి ఇంజెక్షన్ ల ద్వారా తీసుకోవాలి మరియు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించాలి. టైప్-2 డయాబెటిస్ వ్యాధికి గురైన వారిలో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చెందించబడదు లేదా ఉత్పత్తి చెందిన ఇన్సులిన్ వినియోగింపబడదు. ఫలితంగా, శరీరంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగిపోతాయి. ఈ రెండు రకాల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా జీవించాలి అంటే, వారు పాటించే ఆహార నియమాలలో మార్పులను చేసుకొని, ఆరోగ్యకర జీవన శైలిని అనుసరించాలి.

Also Read: MAA Elections 2021: 'మా' సమరంలో మెగా బ్రదర్.. ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు

చిన్న మార్పులే ముఖ్యం
జీవన శైలిలో మరియు ఆహార సేకరణలో చిన్న చిన్న మార్పులను అనుసరించటం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే, తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకుండా ఉండటం చాలా కష్టమే, అనారోగ్యకర ఆహారాలకు దూరంగా ఉంటూ, వ్యాయామాలను అనుసరిస్తూ, ఆరోగ్యకర లక్షణాలను అలవరుచుకోవాలి. మీరు మార్చుకునే అలవాట్ల మార్పులే మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అధిక రక్త పీడన స్థాయిలు చాలా ప్రమాదకరం, కావున మీరు తీసుకునే ఆహారంలో అధిక చక్కెరలు మరియు కొవ్వు పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి.  

ఆరోగ్యకరమైన ఆహారం 
ఆహార మార్పులలో, పోషకాలు అధికంగా ఉన్న, తక్కువ కొవ్వు కలిగిన, క్యాలోరీలు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మీ పాటించే ఆహార ప్రణాళికలో ఉండేలా జాగ్రత్త పడండి. తినే ఆహారంలో ఫైబర్ స్థాయిలు ఎక్కువగా ఉండేలా మరియు అనారోగ్యకర కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోండి. మీరు తీసుకునే ఆహరంలో కార్బోహైడ్రేట్లు ఉన్న, వాటితో ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ, ఆలస్యంగా జీర్ణమైన, శరీరంలోని చక్కెర స్థాయిలను ప్రభావిత పరచని సంక్లిష్ట కార్భోహైడ్రేట్ లను తీసుకోండి. 

Also Read: RTC Fares Increased: దసరా బాదుడు షురూ.. 50 శాతం చార్జీలు పెంచనున్న APS RTC

స్వీట్లకు మరియు పొగకు దూరంగా ఉండండి
స్వీట్స్ అంటే మీకు ఇష్టమా! అకస్మాత్తుగా స్వీట్లను మానటం మీ వల్ల కాదు అవునా! బదులుగా, రోజు తీసుకునే స్వీట్ల శాతాన్ని తగ్గించి, రోజు తినే భోజనంలో ఒకటి లేదా రెండు కలుపుకొండి, అంతేకానీ, స్నాక్స్ ల వలే స్వీట్లను తినకండి. భోజనంలో ఆరోగ్యకర ఆహార పదార్థాలతో పాటూగా చిన్న మొత్తంలో స్వీట్లను తీసుకోవటం వలన శరీరంలోని చక్కెర స్థాయిలు పెద్దగా ప్రభావిత పరచబడవు. ఇలా చేయటం వలన కొన్ని రోజులలోనే స్వీట్లను తీసుకోవటం పూర్తిగా మానేస్తారు. వీటితో పాటూగా పొగ త్రాగటం వంటి వాటికి దూరంగా ఉండటం వలన మీ ఆరోగ్యానికి చాలా మంచిది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News