Food For Knee Pain Relief: ప్రస్తుత కాలంలో చాలా మంది కీళ్ల  నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కీళ్ల నొప్పుల సమస్య బారిన యువత లోనూ మనం గమనించవచ్చు. అధిక బరువు, పోషక ఆహార లోపం కారణంగా చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే క్యాల్షియం లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతున్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల చిన్న ప్రమాదాలు జరిగిన ఎముకలు విరగడం , కీళ్ల నొప్పులు రావడం వంటి సమస్యల బారిన పడుతుంటాము. తగినంత క్యాల్షియం తీసుకోవడం చాలా అవసరం.  క్యాల్షియం అనేది ఎక్కువగా పెరుగు, అటుకులు, పండ్లు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి.  


అయితే కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది మందులు వంటివి తీసుకుంటారు.  దీని  వల్ల కొంత ఉపశమనం లభించిన సమస్య మాత్రం తగ్గదు. అయితే ఈ కీళ్ల నొప్పుల‌ను, ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను తగ్గించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. చిట్కా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం  ఇప్పుడు తెలుసుకుందాం.


ముందుగా కళాయిలో రెండు టీ స్పూన్ల ఆలివ్‌ నూనె తీసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీల‌క‌ర్ర, క‌రివేపాకు, మున‌గాకు, ప‌సుపు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చిని, అల్లం త‌రుగును, ఉప్పును వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత నానబెట్టిన అటకులు కలుపుకోవాలి. పెరుగు, కొత్తిమీర వేసి క‌లుపుకోవాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అటుకుల‌ను, పెరుగును క‌లిపి వండి తీసుకోవడం వ‌ల్ల కీళ్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.  ఈ విధంగా కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాలు పాటించడం వల్ల  చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ చిట్కాను పాటించడం వల్ల కీళ్ల నొప్పి సమస్యల బారిన పడకుండా ఉంటారు.


Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter