Turmeric milk VS Turmeric Water: పసుపుపాలు లేదా పసుపునీరు రెండిటిలో శరీరానికి ఏది ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది..
Turmeric milk VS Turmeric Water: పసుపును మనం తరతరలుగా వివిధ వంటల్లో ఉపయోగిస్తున్నాం. ఇందులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు, మిరియాలు, ఉప్పు ధనియాలు ఇందులో పోషకాలు పుష్కలం ప్రయోజనాలు అధికం.
Turmeric milk VS Turmeric Water: పసుపును మనం తరతరలుగా వివిధ వంటల్లో ఉపయోగిస్తున్నాం. ఇందులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు, మిరియాలు, ఉప్పు ధనియాలు ఇందులో పోషకాలు పుష్కలం ప్రయోజనాలు అధికం. ఆయుర్వేద పరంగా ఈ పసుపును ఒక సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. పసుపులో సీజనల్ వ్యాధులను కూడా దూరం చేసే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే పసుపు మనం కూరల్లో కూడా వండుకుంటాం. పసుపును నీరు లేకపోతే పాలు రెండిట్లో అత్యధిక ప్రయోజనాలు దేనివల్ల కలుగుతాయో తెలుసుకుందాం.
పసుపులో యాక్టివ్ పాలిఫెనల్స్ ఇది ఆంటీ ఆక్సిడెంట్ అంటే వాపుకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కలిగి ఉంటుంది అంతేకాదు ఇందులో ఫైటో న్యుట్రియేంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా సెల్ డామేజ్ కాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.పసుపు నీటిని తీసుకోవటం లేదా పసుపుని పాలతో కలిపి తీసుకోవడం రెండిట్లో ఏది ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
పసుపు పాలు ప్రయోజనాలు..
గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తీసుకోవడం వల్ల కొన్ని వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. రాత్రి పడుకునే ముందు తీసుకోవడం మంచిదని హెల్త్ నిపుణులు చెబుతారు. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి వాపు మంట సమస్యలు రాకుండా జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ నుంచి కాపాడుతుంది.
ఇమ్యూనిటీ బూస్ట్..
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ బూస్ట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది.
మెరుగైన జీర్ణ క్రియ..
పాలతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపులో అజీర్తి గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
మంచి నిద్ర..
రాత్రి పడుకునే ముందు ఇలా పసుపు పాలు తీసుకోవడం వల్ల మంచి నిద్రకు ఉపక్రమించవచ్చు గోరువెచ్చగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
క్యాన్సర్..
పసుపులో ఉండే కర్కూమిన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
మెదడు పనితీరు..
పసుపుపాలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఆల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు ,మెదడు ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది.
స్కిన్ హెల్త్..
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగిన పసుపు మన ముఖంపై యాక్నే రాకుండా నివారిస్తుంది స్కిన్ ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: మీ బొక్కలు బలంగా ఉండాలంటే ఈ 5 తినాల్సిందే.. ఈరోజు నుంచే తినండి..
పసుపు నీటితో ప్రయోజనాలు..
నీళ్లతో కలిపి పసుపు నీటిని తీసుకోవడం వల్ల ఆయుర్వేదం ప్రకారం ఇది ఖాళీ కడుపున తీసుకోవాలి.
డిటాక్సిఫికేషన్..
పసుపు నీటి నీళ్ల ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల ఇది మంచి డిటాక్సిఫికేషన్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపించేసి కాలేయ పనితీరును మెరుగుపరిచి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
బరువు తగ్గుతారు..
పసుపులోని కర్కూమీన్ వల్ల బరువు కూడా తగ్గిపోతారు. మెటబాలిజం రేటు పెరుగుతుంది. వాపు సమస్యలు తగ్గుతాయి.
చర్మ ఆరోగ్యం..
ఇందులోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల పసుపు చర్మ ఆరోగ్యానికి కాపాడుతుంది. జీర్ణ ఆరోగ్యం పసుపు నీటితో కలిపి ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బలపడుతుంది.
ఇదీ చదవండి: మీ శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరిచే 5 ఆహారాలు..
నొప్పి నుంచి ఉపశమనం..
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలకు పసుపు మంచి ఆర్థరైటీస్ నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది జాయింట్ పెయిన్ సమస్యలు ఉండవు.
ఇమ్యూనిటీ బూస్ట్..
లివర్ డిటాక్సిఫై..
పసుపు నీరు లివర్ డిటాక్సిఫికేషన్స్ గా పనిచేస్తుంది. లివర్ నుంచి విష పదార్థాలను బయటకు పంపించడం కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం పసుపు రాత్రి నిద్రపోయే సమయంలో తీసుకోవాలని ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. అయితే పసుపు నీటిని మాత్రం ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల లివర్ డిటాక్స్ఫికేషన్ చేసి బరువు పెరగకుండా కాపాడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి