Kids Health: రిమోట్ ను పిల్లల నుంచి దూరంగా ఉంచండి
మీ ఇంట్లో పిల్లలు ఉంటే టిప్స్ తప్పనిసరిగా పాటించండి. మీ పిల్లల్ని సురక్షితంగా ఉంచండి.
మీ ఇంట్లో ఉన్న చిన్న రిమోట్ పిల్లల్ని ఎంత బిజీగా ఉంచుతోందో మీకు తెలుసా ? పిల్లలకు రిమోట్ ఇచ్చేసి వారికి నచ్చిన ఛానెల్ చూడనిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు అని మీరు అనుకుంటున్నారా? అయితే వారికి స్వేచ్ఛ పేరుతో అనారోగ్యాన్ని కూడా పంచుతున్నారు అని తెలుసుకోండి. ఒక రీసెంట్ సర్వే ప్రకారం ఇంట్లో ఉన్న అతి మురికి వస్తువుల్లో టీవి రిమోట్ ఒకటి అని తేలింది. వ్యాధులను వ్యాప్తి చేయడంలో టీవీ రిమోట్ కీలక పాత్ర పోషిస్తుందట. పిల్లల ఆరోగ్యం ( Health ) విషయంలో జాగ్రత్తలు పాటించండి.
టాయిలెట్ సీటుకన్నా టీవీ రిమోట్ 20 శాతం అధిక మురికిగా ఉంటుంది....
యూకేలో ఉన్న ScS అనే సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. ఇంట్లో ఉండే వస్తువుల్లో ఎక్కువగా వినియోగించబడే రిమోట్ లో అత్యధికంగా బ్యాక్టీరియా, వైరస్ ఉంటుందట.
ఈ సర్వే ప్రకారం టాయిలెట్ సీటుకన్నా టీవీ రిమోట్ 20 శాతం అధిక మురికిగా ఉంటుందట. పరిశోధకులు డెల్ గిల్సాపి ప్రకారం టీవీ రిమోటల్ లో మురికితో పాటు భారీ సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుందట.
ఈ వస్తువులు టాయిలెట్ కన్నా దారుణం..
ఈ సంస్థ సుమారు 2000 కుటుంబాల్లో పరిశోధన చేసింది. ఇందులో డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్ లో ఉన్నా కార్పెట్, బాత్రూమ్ లో కూడా అత్యధిక శాతం బ్యాక్టీరియా ఉంటందట. డోర్ హ్యాండిల్స్ పై కూడా బ్యాక్టిరియా తిష్ట వేసుకుని ఉంటుందట.
రిమోట్ పై ఉండే అధిక శాతం బ్యాక్టిరియా గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నాలుగు చేతులు మారే రిమోట్ వల్ల వ్యాధులు సులభంగా వ్యాపించే అవకాశం ఉందట. ముఖ్యంగా పిల్లలు రిమోట్ ను ఎక్కువగా వాడుతుంటారు. దీని వల్ల పిల్లలు ఎక్కువగా ఆనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉందట. ఈ చిట్కాలు పాటించి మీ లైఫ్ స్టైల్ ( LifeStyle )ను మార్చుకోండి. పిల్లలకు రిమోట్ కాస్త దూరంగా పెట్టండి.