ప్రపంచ మొత్తాన్ని కోవిడ్-19 వైరస్ ( Covid-19) వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా కోట్లాది మందిని కరోనావైరస్ సోకింది. భారత దేశంలో కూడా వైరస్ సంక్రమణ అధికంగా ఉంది. ఇలాంటి సమయంలో గర్భిణి మహిళలు ( Pregnant Women in Covid-19 Pandemic ) చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గర్భిణిలు కరోనావైరస్ నివారణ కోసం ఈ చిట్కాలు ( Tips To Pregnant Women In Coronavirus Times ) పాటించండి.
-
Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
-
Quarantine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత మేరా తగ్గుతుంది. వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. వీటివల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మంచి వెలుగు, గాలి ప్రసరించే గదిలో ఉండాలి ( Good Ventilation To Prevent covid-19 Coronavirus ). దాంతో పాటు సెపెరేట్ బాత్రూమ్ ఉంటే మంచిది. పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు తాగాలి. గర్భిణి మహిళలకు ఏదైనా ఆనారోగ్యం కలిగితే వెంటనే ట్రీట్మెంట్ అందించేందుకు ఏర్పాట్లు జరిగిపోయేలా సిద్ధం అవ్వాలి.
కరోనావైరస్ గర్భిణిలకు సోకకుండా ఉండాలి అంటే.. ( Tips To Pregnant Women To Prevent infection of Covid-19 )
- తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. దీని కోసం సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ను వాడాలి.
- కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus Symptoms ) అంటే దగ్గు, తుమ్ము, జలుబు, జ్వరం ఉన్న వారితో దూరంగా ఉండాలి.
- అనవసరంగా ముక్కు, కళ్లను తాకకుండా చూసుకోవాలి. వైద్యులతో సంప్రదించి వారు చెప్పిన విధంగా చేయాలి
- అత్యవసరం అయితే తప్పా ఆసుపత్రికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. వైద్యులతో వీడియో కాల్ లో సంభాషించే అవకాశం ఉంటే అది కూడా మంచిదే.
- గర్భిణిలు అనవసరంగా బయటికి వెళ్లడం చేయకూడదు. దాంతో పాటు బయటి వాళ్లు వారిని కలవడానికి వస్తే కొంచెం దూరం పాటించేలా చూసుకోవాలి.
- డిలవరీ సమయంలో ఒక వ్యక్తిని మాత్రమే గర్భిణి మహిళ వద్ద ఉండే అవకాశం ఇవ్వాలి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆసుపత్రి నుంచి బయటికి వచ్చేలా చూడాలి.
-
Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే
- Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు
గర్భిణికి కోవిడ్-19 సోకిన వారికి... ( What If Pregnant Women Has Covid-19 Positive )
తల్లికి కరోనావైరస్ ( Coronavirus ) ఇన్ఫెక్షన్ గనక బిడ్డకు అది సోకదు అని .. నెలల నిండక ముందే డిలివరీ అవడం, సంతానానికి వైకల్యం వచ్చే అవకాశం ఈ వైరస్ వల్ల లేవని వైద్యులు చెబుతున్నారు.
పిల్లలకు పాలు ఇవ్వవచ్చా ? ( Breast Feeding During Coronavirus Times )
- పిల్లలకు తల్లిపాలు మంచివి. కోవిడ్-19 సోకిన గర్బిణి మహిళల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.
- పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో చనుబాల ద్వారా పిల్లలకు చేరి అవి వారికి రక్షణ అందిస్తాయి అని పరిశోధనల్లో తేలింది. పిల్లలకు తల్లిపాల ద్వరా రోగ నిరోధక శక్తి కలుగుతుంది.
-
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
-
Quarentine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే