Covaxin Approval: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఎదురైన ఇబ్బందులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. కోవాగ్జిన్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారిని(Corona Pandemic) నియంత్రించేందుకు అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిషీల్డ్, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ప్రధానంగా అందుబాటులో ఉన్నాయి. అయితే మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను మొన్నటివరకూ అంతర్జాతీయంగా అనుమతించలేదు. ఫలితంగా అంతర్జాతీయ ప్రయాణాలకు కోవాగ్జిన్ తీసుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోవాగ్జిన్(Covaxin) అనుమతించాలంటూ భారతదేశం అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటు ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. 


ఇప్పుడు తాజాగా కోవాగ్జిన్‌ను అనుమతి పొందిన కోవిడ్‌ టీకాల జాబితాలో(International Vaccines list) చేర్చినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ఈ నెల 22వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనుందని పేర్కొంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని యూకే వెళ్లిన ప్రయాణికులు ఇకపై ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని భారత్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ తెలిపారు. యూకేలో ప్రవేశించే 18 ఏళ్లలోపు వారి విషయంలోనూ ప్రయాణ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. వ్యాక్సినేషన్‌ పూర్తయితే ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. యూకేకు (UK Recognised Covaxin)చేరిన తరువాత కోవిడ్‌ పరీక్ష నిర్వహిస్తారు. పాజిటివ్‌గా తేలితే పీసీఆర్‌ పరీక్ష ఉచితంగా చేస్తారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తిస్తూ భారత్‌ 96 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు.


Also read: Malala Weds Asser Pics Viral: యాసిర్‌తో నోబుల్ బహుమతి గ్రహీత మలాలా పెళ్లి, ట్రెండ్ అవుతున్న ఫోటోలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook