Uric acid cut foods: ఈ 5 తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు నేచురల్‌గానే తగ్గిపోతాయట..
Uric acid cut foods: ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. శరీరంలో ప్యూరిన్ స్థాయిలు అధికమవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి.
Uric acid cut foods: ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. శరీరంలో ప్యూరిన్ స్థాయిలు అధికమవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది గౌట్, కిడ్నీలో రాళ్లకు దారితీస్తుంది. కొన్ని ఆహారాలతో యూరిక్ యాసిడ్ లెవెల్స్ సమర్థవంతంగా తగ్గించేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
లో ప్యూరిన్ ఫుడ్స్..
అతిగా ప్యూరిన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల సమస్య వస్తుంది. లో ఫ్యూరియన్ ఉండే ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. కొన్ని రకాల పండ్లలో ప్యూరిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ లో ముఖ్యంగా బెల్ పెప్పర్స్, కీర దోసకాయ, క్యారెట్ ఆకుకూరల్లో ప్యూరిన్స్ తక్కువగా ఉంటాయి. అంతే కాదు లో ఫ్యాట్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. పాలు పెరుగు తీసుకోవాలి.
చక్కెరపానియాలు..
చక్కెర అధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. సోడా, పండ్ల రసాల వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఫ్రక్టోస్ లెవెల్స్, కార్న్ సిరప్ అధికంగా ఉంటుంది ఇవి అమాంతం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచేస్తాయి వీటికి బదులుగా హెర్బల్ టీ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు తీసుకోవాలి ఇవి యూరిక్ ఆసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.
ఆరోగ్యకరమైన బరువు..
బరువు అతిగా ఉంటే కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలో పెరుగుతాయి అతిగా కొవ్వు ఉండటం వల్ల యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి ఇబ్బందికరంగా మారుతుంది వంటివి చేస్తుంటే యూరిక్ యాసిడ్ స్టైల్ కూడా తగ్గుతాయి బరువుతో పాటు యూరిక్ ఆసిడ్ స్టైల్ కూడా తగ్గుతాయి.
ఇదీ చదవండి: పియర్ ఫ్రూట్ తింటే దీర్ఘకాలం పాటు జీవిస్తారట..
డైట్రి ఫైబర్..
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి మన శరీరంలో నుంచి అతిగా ఉండే యూరిక్ ఆసిడ్ని బయటికి పంపించేస్తాయి. ఎక్కువగా కూరగాయలు పండ్లు తీసుకోవాలి అందులో ఫైబర్ అతిగా ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తృణధాన్యాల్లో ఫైబర్ ఉంటుంది బ్రౌన్ రైస్ హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవాలి.లెగ్యూమ్స్ ,బీన్స్ ,శనగలు, గింజలు స్నాక్స్ లో చేర్చుకోవాలి. బాదం చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవి ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి.
ఇదీ చదవండి: మీరు చేసే ఈ 5 పొరపాట్లే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం..
ఇన్సులిన్ లెవెల్..
శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం కూడా యూరిక్ ఆసిడ్స్ స్థాయిలను పెంచేస్తాయి ఇన్సులిన్ లెవల్ సమతూలంగా ఉండేలా చూసుకోవాలి దీనికి వైద్యులు సూచించిన మందులను వాడాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter