Uric Acid Problem: ఆధునిక జీవన శైలిలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవనశైలి వ్యాధులు పెద్దఎత్తున వెంటాడుతున్నాయి. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య సాధారణంగా మారిపోయింది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే కేవలం 3 నెలల్లోనే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెడు ఆహారపు అలవాట్ల కారణంగా యూరిక్ యాసిడ్ సమస్య పీడిస్తోంది. ఇంతకుముందు ఈ సమస్య మద్య వయస్సులో, వృద్ధాప్యంలో వస్తుండేది. కానీ ఇప్పుడు యువకులకు కూడా ఈ సమస్య వెంటాడుతోంది. జీవనశైలి సక్రమంగా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమౌతోంది. మోతాదుకు మించి రోజూ మద్యం తాగేవారిలో కూడా ఈ సమస్య వెంటాడుతోంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురౌతాయి. కాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులు తలెత్తవచ్చు. అందుకే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో చికిత్స చేయిస్తే పరిష్కారం ఉంటుంది. 


యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించేందుకు కనీసం మూడు నెలలపాటు పూర్తిగా శాకాహార భోజనం తినాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు తినాల్సి ఉంటుంది. పాలకూర, అరటి చాలా మంచిది. దీంతోపాటు బీరకాయ, పొడుగు ఆనపకాయ, దొండకాయ కూడా మంచిది. ఉప్మా, పోహా, ఇడ్లీ, దోశ, సాంబారు, పలావు వంటివి కూడా తినవచ్చు. మూడు నెలలు మాంసాహారానికి దూరంగా ఉండాలి. రెడ్ మీట్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ అమాంతం పెరిగిపోతుంది.


యూరిక్ యాసిడ్ సమస్య తిరిగి రిపీట్ కాకుండా ఉండాలంటే హెల్తీ డైట్‌తో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందుకే ఎంత అవసరమో అంతే తినాలి. ఏదీ మోతాదుకు మించి తినకూడదు. గ్యాస్ , మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా యూరిక్ యాసిడ్ వల్లే పెరుగుతుంది. 


Also read: Custard Apple Benefits: శీతాకాలం సీతాఫలం కల్గించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావుగా, గుండెకు ఆరోగ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook