Uric Acid Reducing Foods: రక్తంలో చెడు పదార్థం అలాగే మిగిలిపోతుంది యూరిక్ యాసిడ్ గౌట్, కిడ్నీ స్టోన్స్ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కిడ్నీ విష పదార్థాలను బయటికి పంపించడంలో ఫెయిల్ అవుతుంది. దీన్నే హైపర్ యురేసేమియా అంటారు. అంటే యూరిక్ యాసిడ్ అధికంగా మన శరీరంలో పేరుకుపోవటం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా గౌట్‌ సమస్య కూడా వస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించే 7 ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మందార..
ఎండిన మందార టీ రూపం లో తయారు చేసుకుంటే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ యూరిన్ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఇది యూరిక్ యాసిడ్ తక్షణమే శరీరం నుంచి బయటికి పంపించేస్తాయి. అయితే తీసుకునే ఐదు నిమిషాల ముందు వేడి నీళ్లు మీరు తాగాల్సి ఉంటుంది.


దండేలియన్..
ఉదయం పూట శరీరంలో నుంచి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోవాలంటే దండేలియన్ టీ తాగాలి ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేస్తుంది శరీరం నుంచి పదార్థాలను బయటికి తరిమేస్తుంది.


సెలరీ..
సెలెరిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు మంట సమస్యను తగ్గించే గౌట్‌ సమస్యలు రాకుండా కాపాడుతాయి.


అల్లం..
అల్లం టీ అల్లం వంటల్లో వేసుకొని తీసుకోవడం వల్ల మంట సమస్య తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసి ఉడకబెట్టుకొని ఆ స్టెయిన్ చేసుకుని తాగితే కూడా ఇది జాయింట్ పెయిన్స్ రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు ఈ ఆహారం ఇలా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్స్ స్థాయిలో బయటికి వెళ్లిపోతాయి.


ఇదీ చదవండి: ఈ లివర్ హెల్తీ ఫుడ్‌ ఒక్కనెల తింటే పాడైన కాలేయం కూడా పనిచేయాల్సిందేట..


అరటిపండు..
అరటి పండు కూడా యూరిక్ ఆసిడ్స్ స్థాయిలను నివారిస్తాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటికి పంపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


మెగ్నీషియం..
మెగ్నీషియం యూరిక్ ఆసిడ్ స్థాయిలను తగ్గించే స్థాయి బాదం జీడిపప్పు, పాలకూర, గుమ్మడి గింజలు వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ డైట్ లో చేసుకోవడం వల్ల యూరిక్ ఆసిడ్ అవుట్ సమస్యలు రావు కిడ్నీ స్టోన్ సమస్య కూడా ఉండవు.


ఇదీ చదవండి:  రాగి పిండి రోటీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెరగవు..!


ఆపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్స్ స్థాయిలు తగ్గిపోతాయి. అంతేకాదు ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల బరువు పెరగరు ఈజీగా బరువు తగ్గుతారు చేర్చుకోవడం వల్ల యూరిక్ ఆసిడ్స్ స్థాయిలో మిమ్మల్ని వేధించవు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి