కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ, భయం నేపధ్యంలో ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువైంది అందరికీ. రోగ నిరోధక శక్తి ( Immunity power ) ని పెంచుకునే పద్థతుల్ని నిరంతరం అణ్వేషించే క్రమంలో కొన్ని అతిగా వాడితే అనర్ధాలు కొని తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో పాతకాలం నాటి పద్ధతుల్నిఆశ్రయిస్తున్నారంతా. స్టీమ్ వాటర్ ( Steam ) తీసుకోవడం, గోరువెచ్చని పసుపు నీళ్లు తాగడం, విటమిన్ సి, డి ( Vitamin c & Vitamin D ) లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఇలా నిరంతరం అనేక పద్ధతుల్నిఅవలంభిస్తున్నారు.విటమిన్ డి కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు తోడ్పడుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. దాంతో ఇన్నాళ్లూ ఆ లోపం ఉన్నా పట్టించుకోని వాళ్లంతా ఇప్పుడు శ్రద్ధ వహిస్తున్నారు. వాస్తవానికి విటమిన్ డి అనేది సూర్యరశ్మి ( Vitamin d rich in Sun light ) లో పుష్కలంగా లభిస్తుంది. ఇది సాధ్యం కానివారు.. తెలియని వారంతా విటమిన్ డి ట్యాబ్లెట్లకు అలవాటు పడుతున్నారు. అవసరం కంటే ఎక్కవగా వాడేస్తున్నారు. విటమిట్ డి ట్యాబ్లెట్లు ( Vitamin D tablets ) అధికంగా వాడటం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి ఎక్కువవుతుంది. ఫలితంగా విషపదార్ధాల శాతం పెరుగుతుంది. దాంతో తీవ్ర అస్వస్థతకు గురవుతారని కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి వర్గాలు ఓ సర్వేలో హెచ్చరించారు. విటమిన్ డి వాడే ముందు ఆ విటమిన్ మన శరీరంలో ఏ మేరకు ఉందో అనేది విటమిన్ డి పరీక్ష ద్వారా చెక్ చేసుకుని వాడాల్సి ఉంటుంది. లేకపోతే అసలుకే మోసం వస్తుంది. 


విటమిన్ డి అనేది చేపలు, గుడ్లు, కొత్తిమీర, బఠానీ, పాలు, ఆరెంజ్ లలో ఎక్కువగా ఉంటుంది. ఇలా సహజసిద్ధంగా లభించే ఆహార పదార్ధాలతో విటమిన్ డి లభిస్తే..కాస్త అతి అయినా ప్రమాదముండదనేది నిపుణులు చెబుతున్న మాట. అందుకే ట్యాబ్లెట్లపై ఆధారపడే కంటే ఆహారపదార్ధాల్ని ఆశ్రయిస్తే మంచిది. Also read: Cough and Cold Remedies: జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలిగించే 8 రకాల ఆహార పదార్ధాలు ఇవే