Vegetable Masala Pulao: మసాలా వెజ్ పులావ్ అంటే కేవలం ఒక వంటకం కాదు, అది ఒక రుచికరమైన అనుభూతి! బాస్మతి బియ్యం, రకరకాల కూరగాయలు, ఆయుర్వేద గుణాలు కలిగిన మసాలాల కలయికతో తయారు చేసే ఈ పులావ్, భారతీయ వంటకాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీని అతి తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ సందర్భంలోనైనా సర్వ్ చేయడానికి అనువైనది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు:


బాస్మతి బియ్యం - 2 కప్పులు
క్యారెట్, బీన్స్, బటానీ - తరిగినవి (ప్రతిదీ 1/2 కప్పు)
ఉల్లిపాయ - 1 (తరిగినది)


తోటకూర - 1 పిడి (తరిగినది)
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్


దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 2
పసుపు పొడి - 1/4 టీస్పూన్


కారం పొడి - రుచికి తగినంత
గరం మసాలా - 1/4 టీస్పూన్
కొత్తిమీర - తరిగినది (గార్నిష్ కోసం)


నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
నీరు - 3 1/2 కప్పులు


తయారీ విధానం:


బాస్మతి బియ్యాన్ని కడిగి, 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఒక పాత్రలో నూనె వేసి వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వాసన వచ్చే వరకు వేయించండి. తరిగిన ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. క్యారెట్, బీన్స్, బటానీ వేసి కొద్దిగా వేయించండి. పసుపు పొడి, కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. నానబెట్టిన బియ్యం, తోటకూర, ఉప్పు వేసి బాగా కలపండి. నీరు పోసి మరిగించి, మంట తగ్గించి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించండి. పులావ్ సిద్ధమైన తరువాత కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి. వెచ్చగా సర్వ్ చేయండి.


చిట్కాలు:


బియ్యం పొడిపొడిగా ఉండాలంటే నీటి పరిమాణం తగ్గించి, కుక్కర్‌లో ఉడికించవచ్చు. మీ ఇష్టం ప్రకారం ఇతర కూరగాయలు కూడా వాడవచ్చు. పులావ్‌ను రాయిత లేదా దహీతో సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.


మసాలా వెజ్ పులావ్ పోషకాలు:


అన్నంలో కార్బోహైడ్రేట్ల అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.పులావ్ లో ఉపయోగించే కూరగాయలు, దాల్చిన చెక్కలు ప్రోటీన్‌ను అందిస్తాయి, ఇది శరీర కణజాలాల మరమ్మత్తుకు అవసరపడుతాయి. పులావ్ లో ఉపయోగించే కూరగాయలు విటమిన్ A, C, K  ఫోలేట్ వంటి విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచడానికి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.


Also Read: Garlic For Cholesterol: ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఈ సమస్యలకు చెక్‌!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter