Vitamin B12 deficiency symptoms: మన శరీరంలో ఏ విటమిన్స్ , మినరల్స్ కొరత ఏర్పడిన వాటిలో కొన్ని లక్షణాలు మన శరీరంపై ఏదో విధంగా కనిపిస్తాయి.  వాటిని గుర్తించి మనం ఆ విటమిన్స్ ని మళ్ళీ  మన శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఈరోజు విటమిన్ బి12 లోపిస్తే ఆ లక్షణాలు కాళ్లలో ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాం.మన శరీరానికి ఏ విటమిన్, ప్రొటీన్లు, మినరల్స్ తక్కువ పడినా అది ఏదో విధంగా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. వాటిని పునరుద్ధరించకపోతే ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ విటమిన్లు, మినరల్స్ లేమి మనం సరైన ఆరోగ్యశైలిని పాటించకపోవడం వల్ల ఏర్పడుతుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు సరైన మోతులో మోతాదులు లేకపోవడం వల్ల అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ లభించదు. దీంతో విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి:  శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టే 7 హెల్తీ మార్నింగ్ డ్రింక్స్..


మన శరీరంలో విటమిన్ బి 12 లోపించినప్పుడు నరాలు దెబ్బతింటాయి. అంతేకాదు వాటి లక్షణాలు ముఖ్యంగా కాళ్లలో కనిపిస్తాయి. కాళ్లలో జలదరింపు అనుభూతి కలుగుతుంది. అంతే కాదు తలనొప్పి మొదలైన సమస్యలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే విటమిన్ బి12 ఒపిస్తే మన శరీరంలో రక్తం కూడా తగ్గుతుంది . ఈ వ్యక్తులు రక్తహీనతతో బాధపడుతుంటారు.


విటమిన్ బీ 12 మన శరీరంలో తగ్గినప్పుడు కనిపించే మరో లక్షణం మతిమరుపు. మనిషి చూడటానికి సైతం వీక్ గా కనిపిస్తారు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.ముఖ్యంగా మన శరీరంలో విటమిన్ బి12 తగ్గడానికి కారణం మన శరీరంలో ఎర్ర రక్త కణాలు సరైన మోతాదులో లేకపోవడం.  దీంతో కాళ్ళలో నొప్పులు, జలదరింపు, వాపు లక్షణాలు కనిపిస్తాయి.విటమిన్ బి12 లోపించిన కొందరిలో హృదయ స్పందనలో కూడా మార్పు కనిపిస్తుంది.  కొందరు బరువు తగ్గిపోతారు. ఎక్కువ శాతం ఆడవారిలో ఈ విటమిన్ బి12 కనిపిస్తుంది. దీంతో వాళ్ళు అనిమీయాకు కూడా గురవుతారు.విటమిన్ బి12 మళ్లీ మన శరీరంలో భర్తీ చేయాలంటే పాలకూర నారింజ,బియ్యం , బార్లీ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.


ఇదీ చదవండి: మీ ఊపిరితిత్తులను ఒక్కసారిగా క్లీన్ చేసే 6 డ్రింక్స్.. ఇంట్లోనే చేసుకోండి..
విటమిన్ బి12 లోపం లక్షణాలు కనిపిస్తే ముందుగా వైద్యులని కలవాలి వారి సూచన మేరకు మన డైట్ మార్చుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో ఈ విటమిన్ బి12 లోపం లక్షణాలు కనిపించవు వారికి అదనపు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter