Vitamin B12 Foods: విటమిన్ బి12 తగ్గితే శరీరం గుల్లయిపోవడం ఖాయం, ఎలాంటి ఆహారం తినాలి
Vitamin B12 Foods: హెల్తీ బాడీ కావాలంటే శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరమౌతాయి. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ బి12. ఈ విటమిన్ లోపిస్తే అన్ని విధాలుగా శరీరానికి హాని కలుగుతుంది. అందుకే విటమిన్ బి 12 సమృద్ధిగా ఉండే ఆహార పదార్ధాల్ని తీసుకోవాలి.
Vitamin B12 Foods: విటమిన్ బి 12 మనిషి శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్ అనడంంలో ఏమాత్రం సందేహం లేదు. విటమిన్ బి12 కారణంగా అటు మెదడు, ఇటు శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే విటమిన్ బి 12 లోపం లేకుండా చూసుకోవాలి.
మానవ శరీరంలోని నాడీ వ్యవస్థను సరి చేసేందుకు విటమిన్ బి 12 చాలా అవసరమని వైద్యులు చెబుతుంటారు. విటమిన్ బి12 లోపముంటే శరీరంలో ఎనీమియా సమస్య తలెత్తవచ్చు. సాధారణంగా విటమిన్ బి12 అనేది మాంసాహార పదార్ధాల్లో ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తిననివాళ్లు కొన్ని రకాల పదార్ధాలను డైట్‌లో చేర్చుకుంటే విటమిన్ బి12 లోపం సరిచేయవచ్చు.
సోయా బీన్స్
సాధారణంగా సోయా బీన్స్‌ను చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. విటమిన్ బి12 లోపాన్ని సరి జేసేందుకు సోయా బీన్స్ తప్పకుండా వినియోగించాలి. సోయా బీన్స్ కూర లేదా సోయా పాలు కూడా తీసుకోవచ్చు.
ఓట్స్ తప్పనిసరి
ఓట్స్ నిజంగానే ఓ అద్భుతమైన పదార్ధం. వివిధ రకాల వ్యాధిగ్రస్థులు ఓట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. విటమిన్ బి12 లోపాన్ని సరిజేసే పోషకాలు ఇందులో పెద్దమొత్తంలో ఉన్నాయి. అందుకే రోజూ ఓట్స్ తీసుకుంటే విటమిన్ బి12 లోపం పోగొట్టవచ్చు.
మాంసాహారం తిననివాళ్లు విటమిన్ బి 12 కోసం మష్రూం తింటే మంచిది. ఇటీవలి కాలంలో మష్రూంకు డిమాండ్ పెరుగుతోంది. మష్రూం అనేది విటమిన్ బి12కు మంచి ప్రత్యామ్నాయం.
ఇవి కాకుండా చేపలు, మాంసాహారం, గుడ్లలో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. మాంసాహారంతో పోలిస్తే శాకాహారంలో విటమిన్ బి12 లభించడం తక్కువే అని చెప్పాలి. విటమిన్ బి12 లోపించడం వల్ల ప్రధానంగా తీవ్రమైన అలసట కన్పిస్తుంది.
Also read: High Cholesterol: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందా?, రక్తంలో కొవ్వు తగ్గడానికి ఇలా చేయండి చాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook