Vitamin B6 Rich Foods: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే వీటిని ఆహారంగా తీసుకోండి..
Vitamin B6 Rich Foods: విటమిన్ B6 ను పిరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా దీనిని నీటిలో కరిగే విటమిన్ లని కూడా పిలుస్తారు. అయితే ఇది ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో రక్తాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.
Vitamin B6 Rich Foods: విటమిన్ B6 ను పిరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా దీనిని నీటిలో కరిగే విటమిన్ లని కూడా పిలుస్తారు. అయితే ఇది ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో రక్తాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అయితే ఇది శరీరంలో కోరతగా లేకుండా ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విటమిన్ B6 అధికంగా ఉండే ఆహారాలు:
1. పాలు:
ఆవు, మేక పాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని ద్వారా శరీరానికి విటమిన్ B6 అవసరాలను కూడా తీర్చవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాడీలో ఈ లోపాలు ఉంటే..నాడీ వ్యవస్థ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
2. సాల్మన్ చేపలు:
సీ ఫుడ్‌లో కూడా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఈ చేపల్లో ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఈ చేపల్లో విటమిన్ B6 సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని వారానికి ఒక్క సారి తీసుకుంటే అడ్రినల్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ప్రోటీన్లు కూడా పుష్కలంగా లభిస్తుంది.
3. క్యారెట్:
క్యారెట్‌లో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి6 అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్యారెట్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా ఒక గ్లాసు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వేసుకుని తీసుకోవడం కంటే..డైర్టెక్ట్‌గా నమిలి తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
4. బచ్చలికూర:
ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో విటమిన్ B6, విటమిన్ A, విటమిన్ C సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఈ ఆకులను సలాడ్, జ్యూస్‌లా వినియోగించాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook