Vitamin C Uses: వేసవిలో మీ ఆరోగ్యానికి విటమిన్ సి కీలకం, దాని వల్ల ప్రయోజనాలు మీకోసం
Vitamin C Uses: Vitamin C Fruits | మీ ఆరోగ్యానికి దోహదం చేసే రోగ నిరోధకశక్తిని పెంచుకుంటే మీ సమస్య సగం తీరిపోయినట్లే. విటమిన్ సి లభించే ఆహారం, పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం వేసవిలో మెరుగ్గా ఉంటుంది. మార్చి నెల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
Vitamin C Uses: మార్చి నెల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ వేసవిలో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ప్రజలు ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచిస్తున్నారు. అయితే అదే సమయంలో మీ ఆరోగ్యానికి దోహదం చేసే రోగ నిరోధకశక్తిని పెంచుకుంటే మీ సమస్య సగం తీరిపోయినట్లే. విటమిన్ సి లభించే ఆహారం, పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం వేసవిలో మెరుగ్గా ఉంటుంది.
వేసవి కాలంలో చెమట రూపంలో విటమిన్ సి బయటకు వెళ్తుంది. కొన్ని పర్యాయాలు డీహైడ్రేషన్ సమస్య బారిన పడుతుంటాం. కనుక విటమిన్ సి పదార్థాలు తీసుకుంటే వైరస్, క్రిములు, సూక్ష్మజీవులను మీ శరీరం సులువుగా ఎదుర్కొంటోంది. విటమిన్ సి(Vitamin C) మీ శరీరంలో అధికంగా ఉంటే మీరు ఒత్తిడిని జయిస్తారు. వేసవిలో సూర్యతాపాన్ని సైతం తట్టుకుని మీ పనులను సులువుగా చేసుకోవచ్చు. ఉసిరి, నిమ్మకాయాలు లాంటి పదార్థాల ద్వారా ఇంట్లోనే విటమిన్ సి తీసుకోవాలి. పుల్లగా పండ్లు, సిట్రిక్ యాసిడ్ మీకు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ను అందిస్తాయి.
Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి, సులువైన విధానం
కమలా ఫలం, బత్తాయి పండ్లు, యాపిల్ పండ్లలో విటమిన్ సి మీకు పుష్కలంగా లభిస్తుంది. వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరానికి అధికంగా విటమిన్ సి వచ్చే పదార్థాలు తీసుకోవాలి. పుచ్చకాయ, బొప్పాయి, ద్రాక్షపండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక వేసవిలో పండ్లు అందులోనూ పుల్లగా ఉండేవి తింటే మీకు అధికంగా శక్తి లభిస్తుంది. న్యూజిలాండ్ లాంటి శీతల ప్రదేశాలలో అధికంగా పండించే కివీ పండ్లు భారత్‌లోనూ పలు నగరాలు, పట్టణాల్లో లభిస్తుంటాయి. కివీ తింటే విటమిన్ సి తో పాటు మరికొన్ని విటమిన్లను మీకు అందించి శరీరాన్ని సైతం వేసవితాపం(Summer Health Care) నుంచి కాపాడుతుంది.
Also Read: Summer Health Care: వేసవి కాలంలో మీ Health కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి
బొప్పాయి, జామకాయ, పైనాపిల్, మామిడి పండ్లు, బ్రకోలి లాంటివి రోజూ కనీసం ఒకటి వేసవిలో ప్రతిరోజూ తింటే మీ రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజు ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఇమ్యానిటీ పెరుగుతుంది. వేసవిలో తేనే, నిమ్మరసం రోజూ ఉదయాన్నే తాగినా, అరటి పండ్లు(Banana) తిన్నా మీ శరీరానికి ఆరోజుకు సరిపడా రోగనిరోధక వక్తి అందుతుంది. తద్వారా మీరు ఊష్ణతాపాన్ని తట్టుకుంటూ మీ పనులు పూర్తి చేసుకుంటారు. అలసట, ఒత్తిడి లాంటివి మీ దరి చేరవు.
Also Read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా, అయితే ఇడ్లీని Breakfastగా తీసుకోవచ్చా
ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల సమయంలో గొడుగు, వాటర్ బాటిల్ వెంట లేకుండా బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా వీలైతే ఆ సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమని చెబుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook