Idli For Breakfast: మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అవును అయితే, బరువు తగ్గాలనుకుంటే మొదటి నియమాలలో ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం తినడం. అందులో భాగంగా అల్పాహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఒక వంటకం ఇడ్లీని చాలా మంది ఎంచుకుంటారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ వంటకం ఇడ్లీ. పోషకాలతో కూడిన ఇడ్లీ బరువు తగ్గించే డైట్‌లో ఉన్నవారికి ఇది మంచిదా? కాదా? ఇక్కడ తెలుసుకుందాం.
ఇడ్లీ మంచి అల్పాహారమా..
న్యూట్రిషనిస్ట్ అరోషి అగర్వాల్ మాటల్లో తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంపిక చేసుకునేటప్పుడు ఇడ్లీలను చాలా మంది ఎంచుకుంటారు. ఉదయం వేళ ఇడ్లీలను అల్పాహారంగా తీసుకోవడం ఉత్తమమని చెప్పారు. అవసరమైన పోషకాలను కలిగి ఉండే ఇడ్లీ తింటే శరీరం తేలికగా అనిపిస్తుంది. సులభంగా జీర్ణం అవుతుంది. అతి బరువు, అధిక బరువు సమస్యలు ఎదుర్కొనేవారు అల్పాహారం(Breakfast)గా ఇడ్లీని తప్పక తినవచ్చునని న్యూట్రిషనిస్ట్ అభిప్రాయపడ్డారు.
Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి, సులువైన విధానం
బరువు తగ్గడానికి ఇడ్లీ
భారతీయులు అధికంగా తినే అల్పాహారం ఇడ్లీ. ఇందుకు కారణంగా ఆవిరిలో వండే ఈ పదార్థంలో కేలరీలు చాలా తక్కువ. ఒవ ఇడ్లీ ముక్కలో దాదాపు సుమారు 33 కేలరీలు మాత్రమే ఉన్నాయి. ఇది తింటే మీకు అధికంగా ప్రోటీషన్లు అందవు. ఫైబర్ మరియు ప్రోటీన్ కావాలసినంత అందిస్తుంది. తగినంత ప్రోటీన్ మరియు ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయి
బియ్యం మరియు మినపపప్పు యొక్క మిశ్రమం ఇడ్లీ. కూరగాయలు(Vegetables), వోట్స్, రాగి నుండి మిల్లెట్ వరకు మీ రుచికి అనుగుణంగా ఇడ్లీలను తినవచ్చు. ఇది పులియబెట్టిన ఆహార పదార్థం. ఇది మన శరీరాన్ని మరింత పోషణను అందించడంలో సహాయపడుతుంది. ఇది ప్రోటీన్లు మరియు విటమిన్ బి మీకు కావలసినంత అందుతుంది. రోగనిరోధక వ్యవస్థను ఇడ్లీ మెరుగుచేస్తుంది. అదే సమయంలో బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఇడ్లీలో లాక్టిక్ ఆమ్లం కూడా ఉంటుంది.
Also Read: Summer Health Care: వేసవి కాలంలో మీ Health కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి
ఏదైనా ఎక్కువగా తిన్నా, చేసిన సమస్యకు దారితీస్తుందని న్యూట్రిషనిస్ట్ పేర్కొన్నారు. బరువు తగ్గించే ఆహారంలో భాగంగా ఇడ్లీలను అల్పాహారంగా తీసుకోవడం మంచిది. కానీ తగినంతగా మాత్రమే తినాలి. అందుకు తగ్గట్లుగా కేలరీలను తగ్గించుకుంటేనే బరువు సమస్య అదుపులోకి వస్తుందననారు.
గమనిక: ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చే ఆహారం ఇతరులకు పని చేయకపోవచ్చు. ఇడ్లీ కానీ ఏదైనా పదార్థం తింటే మీకు అలర్జీ లేదని నిర్ధారించుకుంటే వాటిని తినవచ్చు. లేదా వైద్యులను సంప్రదించి బరువు తగ్గే నియమాలు పాటించడం ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook