Vitamin C: విటమిన్ సి. ఇప్పుడు బహుశా అందరికీ ఇది బాగా పరిచితమైన విటమిన్. కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ సి ప్రాధ్యాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావల్సినంత విటమిన్ సి లభిస్తుందనే సంగతి మర్చిపోతున్నాం. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఉసిరి తినడం మరోసారి అలవాటు చేసుకోవల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలావరకూ పండ్లు, కాయలు సీజన్‌ను బట్టి లభిస్తాయి. ఏ కాలంలో ఏ పండ్లు తింటే మంచిదో దాని ప్రకారమే ప్రకృతి మనకందిస్తుంటుంది. చలికాలంలో ఎక్కువగా లభించే కాయల్లో ఒకటి ఉసిరికాయ ( Amla ).ఉసిరికాయంటే కేరాఫ్ విటమిన్ సి ( Vitamin C ) గా చెప్పవచ్చు. లేదా విటమిన్ సి కు పర్యాయ పదమే ఉసిరికాయని అనవచ్చు. చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయల్ని తింటే చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. చలికాలం ( Winter ) లో ఉసిరికాయల్ని ఓ భాగంగా చేసుకుంటే మరీ మంచిది.


ప్రకృతిలో లభించేవాటిలో ఒక్క ఉసిరికాయల్లోనే విటమిన్‌ సి మనకు సమృద్ధిగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కంటే ఎక్కువగా విటమిన్‌ సి ఉసిరికాయల్లోనే లభిస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత ఎక్కువగా ఉసిరికాయల్ని తీసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుత సమయంలో మనకు కావల్సింది రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెంచుకోవడమే. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం అనేది  రాకుండా ఉంటుంది. శీతాకాలంలో సహజంగా జీర్ణ ప్రక్రియ ( Digestion ) సమస్య తలెత్తుతుంది. ప్రతిరోజూ ఉసిరికాయల రసాన్ని తాగితే తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. 


ఇక డయాబెటిస్‌ ( Diabetes ) సమస్య ఉన్నవారు ఉసిరికాయలను తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది. ఈ కారణంగా శరీరంలోని ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్‌ లెవెల్స్‌ క్రమంగా తగ్గుతాయి. మరోవైపు శీతాకాలంలో ప్రధానంగా ఎదురయ్యే మరో సమస్య చర్మ సంబంధమైనవి. చర్మం పొడిబారడం, మచ్చలు రావడం వంటివి. ప్రతిరోజూ ఉసిరికాయ రసం తాగితే..ఈ సమస్యలు తగ్గుతాయి. వెంట్రుకల సమస్య కూడా పోతుంది. ఉసిరికాయల్ని కేవలం రసం ( Amla juice ) రూపంలోనే కాకుండా..రుచిగా ఉండాలంటే ఉసిరికాయల్ని కాస్త ఉప్పు, కారం కలిపిన నీళ్లలో నానబెట్టి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది.ఇప్పుడు కరోనా వైరస్(Coronavirus)కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో విటమిన్ సి కోసం ఉసిరికాయల్ని తరచూ తీసుకుంటే మంచిది. 


Also read: Muskmelon Benefits: వేసవిలో కర్భూజ తింటే వడదెబ్బకు చెక్, గుండెకు సైతం ప్రయోజనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook