Advantages Of Waking Up Early: ఉదయాన్నే లేచే అలవాటు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఉదయం గంటలకు మేల్కొలపడం వల్ల శరీరం ఎంతో చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 
ఆయుర్వేద నిపుణుల ప్రకారం ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేవడం వల్ల శరీరం సూపర్‌ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రతిరోజు ఉదయం నిద్రలేవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం: 


శరీరం మరమ్మతు: 


నిద్ర సమయంలో శరీరం మరమ్మతు చేసుకుంటుంది. ఉదయాన్నే లేవడం వల్ల ఈ మరమ్మతు ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో మనం రోజంతా చురుగ్గా ఉండడానికి శక్తిని పొందుతాము. నీరసంగా, అసలటగా ఆసలు అనిపించకుండా ఉంటుంది. కాబట్టి ప్రతరోజూ ఉదయం ఐదు గంటలకు లేవడానికి ప్రయత్నం చేయడం మంచిది. 


మెదడుకు ఆక్సిజన్: 


ఉదయాన్నే పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. ఈ సమయంలో శ్వాస తీసుకోవడం వల్ల మెదడుకు అధికంగా ఆక్సిజన్ అందుతుంది. దీంతో మన మెదడు చురుగ్గా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజంగా ఉత్సాహంగా ఉంటారు. చిరారు, అలసట వంటి లక్షణాలు కనిపించవు.


మంచి జీర్ణక్రియ: 


ఉదయాన్నే లేచి కాసేపు నడకకు వెళ్లడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు సమస్యలతో బాధపడేవారు ఉదయం నిద్రలేవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయి. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. 


కండరాలకు బలం: 


ఉదయాన్నే కొద్దిగా వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడుతాయి. శరీరం చురుగ్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన కండరాలు సొంతం చేసుకోవచ్చు. 


మానసిక ప్రశాంతత: 


ఉదయం లేవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.


రోగ నిరోధక శక్తి:


 ఉదయం వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనారోగ్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


ఉదయాన్నే లేవడానికి కొన్ని చిట్కాలు:


ముందు రోజు రాత్రి త్వరగా పడుకోవడం: సరిపడా నిద్ర పోవడం చాలా ముఖ్యం. 


అలారం గడియారం దూరంగా ఉంచడం: దీంతో మీరు నిద్ర లేచేందుకు కొంచెం కదలవలసి వస్తుంది.


ఉదయం లేవగానే వెంటనే నీళ్లు తాగడం: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


సూర్యరశ్మిని తాకడం: ఇది మన శరీరంలోని విటమిన్ డి స్థాయిని పెంచుతుంది.


ఉదయం కాఫీ లేదా టీ తాగడం మానుకోవడం: ఇవి నిద్రను కలవరపరుస్తాయి.


ముఖ్యంగా:


ఉదయాన్నే లేవడం అనేది ఒక అలవాటు. ఈ అలవాటును ఏర్పరచుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ క్రమంగా ఈ అలవాటు మీ జీవితంలో భాగం అయిపోతుంది.


Also read: Black Salt: వేడి నీళ్లలో దీన్ని కలుపుకుని తాగితే నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter