Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నారా..ఈ దుష్ప్రభావాలు తప్పవు..!!
Watermelon: ఎండా కాలంలో చాలా మంది శరీరం హైడ్రెట్‌గా ఉండడానికి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినడానికి ఇష్టపడతారు. ఈ నీరు శాతం అధికంగా ఉన్న పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Watermelon: ఎండా కాలంలో చాలా మంది శరీరం హైడ్రెట్‌గా ఉండడానికి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినడానికి ఇష్టపడతారు. ఈ నీరు శాతం అధికంగా ఉన్న పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, పీచు వంటి అనేక పోషక విలువలుంటాయి. ఇందులో ఉండే పీచు ఆకలిని నియంత్రించేందుకు దోహదపడుతుంది. కాబట్టి బరువు తగ్గించడానికి కృషి చేస్తుంది. కానీ పుచ్చకాయను చాలా మంది కట్ చేసి ఫ్రిజ్ లో ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో తెలుసుకుందాం..
పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల కలిగే నష్టాలు:
అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి:
పుచ్చకాయను తోక్క భాగం చాలా మందంగా ఉంటుంది. కావున త్వరగా చెడిపోకుండా ఉంటుంది. దాదాపు 15-20 రోజుల వరకు ఫ్రెస్‌గా ఉంటుంది. అయితే పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటిపై బ్యాక్టీరియా చేరి..కాయలో పోషక విలువలు తగ్గిపోయి. శరీరానికి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి.
చల్లని పుచ్చకాయ తినడం వల్ల కలిగే నష్టాలు:
పుచ్చకాయ శరీరానికి వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే దీనిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని పోషణ తగ్గుతుంది. అలాగే చల్లని పుచ్చకాయ తింటే దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు, కట్ ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి పుచ్చకాయను తింటే.. ఫుడ్-పాయిజన్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ తాజా పుచ్చకాయను మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Divyavani Resign: టీడీపీకి దివ్య వాణి రాజీనామా..త్వరలో ఆ పార్టీ గూటికేనా..!
Also Read:AP Govt: అమ్మ ఒడి పథకం రద్దు చేస్తున్నారా..? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook