Watermelon Seeds Benefits: వేసవిలో సమృద్ధిగా లభించే పుచ్చకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎండల ధాటికి డీహైడ్రేషన్ కు గురికాకుండా దీన్ని తింటుంటారు. కానీ, అందులో గుజ్జు తిని.. విత్తనాలను విడిచిపెడతాం. అయితే ఆ విత్తనాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయలోని విత్తనాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే ప్రొటీన్లు, కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్, కాపర్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎముకలను ధృఢంగా మార్చేందుకు సహయం చేస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుచ్చకాయ గింజలను ఎలా తీసుకోవాలి?


మీరు పుచ్చకాయ గింజలను పచ్చిగా, మొలకెత్తిన, వేయించి తినవచ్చు. ఈ విత్తనాలు ఏ రూపంలో ఉన్నా చాలా రుచికరంగా ఉండడం సహా ఆరోగ్యంగానూ ఉంటాయి. పుచ్చకాయ గింజలు సాధారణంగా మొలకెత్తిన తర్వాత పోషకాలు అధికంగా లభిస్తాయి. కేవలం ఒక కప్పు పుచ్చకాయ గింజలు మీ రోజువారీ అవసరాలలో 140% కంటే ఎక్కువ మెగ్నీషియంను అందించగలవు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 


చర్మం ఆరోగ్యంగా..


పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి పుష్కలంగా ఉండటం వల్ల మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పుచ్చకాయ విత్తనాలతో తీసిన నూనెతో మొటిమలు, వృద్ధాప్య ప్రారంభ సంకేతాల చికిత్సతో పాటు వివిధ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది మీ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజలు మీ డల్, డ్రై స్కిన్‌కి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.


వెంట్రుకలు బలంగా మారేందుకు..


జుట్టు ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. పుచ్చకాయ గింజలలో ఉండే ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు మీ జట్టును బలంగా చేస్తాయి. దీంతో పాటు జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. పుచ్చకాయ విత్తనాలలోని మాంగనీస్ జుట్టు రాలడం సహా డ్యామేజింగ్ జుట్టును క్యూర్ చేస్తుంది. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు ద్వారా గ్రహించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)    


Also Read: Hand Shivering Exercise: ఈ వ్యాయామాలతో చేతులు వణికే సమస్యను నివారించుకోవచ్చు!


Also Read: Watermelon Benefits: పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.