COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weak Bones Reasons: శరీరం దృఢంగా..బలంగా ఉండడానికి ఎముకలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ప్రస్తుతం చాలా మందిలో ఎముకల అరిగి, దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు శరీరంలోని కాల్షియం తగ్గడం కారణంగానే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో కాలుష్యం తగ్గి విటమిన్‌ డీ లోపం సమస్యలు కూడా వస్తున్నాయి. దీని కారణంగా ఎముకలు అరగడమే కాకుండా మోకాళ్ల వద్ద తీవ్ర నొప్పులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 



ఎముకలు బలహీనంగా మారడానికి ప్రధాన కారణాలు:
✾ ప్రస్తుతం చాలా మంది రెడ్‌ మీట్‌ను అతిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా శరీరంలో ప్రోటీన్ల పరిమాణాలు పెరుగుతున్నారు. దీంతో ఎసిడిటీ సమస్య కారణంగా  విసర్జన రూపంలో కాల్షియం బయటకు వెళ్లిపోతోంది. కాబట్టి ప్రోటీన్లు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


✾ కొంతమందిలో కార్బోనేటేడ్ అధిక పరిమాణంలో లభించే శీతల పానీయాలు, ఐస్‌ క్రీమ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలహీనంగా మారుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అతిగా ఫాస్ఫేట్ కలిగిన డ్రింక్స్‌ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


✾ ప్రస్తుతం కొంతమంది ఎసిడిటీ మందులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని కారణంగా కూడా ఎముకల సమస్యలు వస్తున్నాయి. ఇందులో అధిక పరిమాణంలో రసాయనాలు ఉంటాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర ఎముకల సమస్యలు దారి తీయోచ్చు. 


✾ ఇప్పటికే ఎముక బలహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు టీ, కాఫీని తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్‌ ఎముకలపై ప్రభావం చూపుతుంది. దీని కారనంగా కూడా తీవ్ర ఎముక సమ్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ఎముకల ఆరోగ్యం కోసం ఇలా చేయండి:
✾ ఎముకలు దృఢంగా ఉండడానికి ప్రతి రోజు కాల్షియం, పొటాషియం అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 


✾ ఎముకల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా ఆహారంలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్ తీసుకోవాల్సి ఉంటుంది.


✾ బోన్స్‌ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో  కాల్షియం, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తీవ్ర ఎముకల సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 


✾ ప్రతి రోజు ఉదయం పాలను తప్పకుండా తాగాల్సి ఉంటుంది. పాలు తాగని వారు ప్రతి రోజు పెరుగు, పనీర్‌ను కూడా తీసుకోవచ్చు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి