Weight Gain In 7 Days: బరువు పెరగడం పెద్ద సమస్యగా మారితే.. శరీరంలో పోషకారం వల్ల బరువు తగ్గినా అంతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడానికి మార్కెట్‌ లభించే చాలా రకాల ఫుడ్స్‌ను తీసుకుంటున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే చాలా మంది బరువు పెరిగే క్రమంలో అనారోగ్య ఆహారాలను తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బరువు పెరగడానికి  మంచి ఆరోగ్యం కోసం కచ్చితంగా పోషకాలున్న పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరడానికి ఉపయోగించే పండ్లలో అరటిపండ్లు ఒకటి.. ఇవి శరీర బరువును పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేస్తుంది. బరువు పెరగడానికి అరటిపండును ఎలా తినాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటి పండ్లను ఎలా తింటే తొందరగా బరువు పెరుగుతారో తెలుసా..!


ఆరోగ్యంగా బరువు పెరగడానికి అరటిపండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్ల, కేలరీలు అధిక పరిమాణంలో ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరలోనే బరువు పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక అరటి పండులో  105 కేలరీలు నుంచి 27 గ్రాముల వరకు పిండి పదార్థాలు ఉంటాయి. కావున వీటిని తినడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం తగ్గి.. బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రం పూర్తిగా పండిన పండ్లను తినకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో చక్కెర పరిమాణాలను పెంచుతుంది. కావున మధుమేహంతో బాధపడుతున్న వారు వీటిని తినకపోవడం మంచిది.


ఇలా తినాలి:


శరీర బరువును పెంచుకోవడానికి అరటి పండును చాలా రకాలుగా తినొచ్చు. ఉదయంపూట వర్కవుట్ చేసిన తర్వాత అరటి పండును జ్యూస్‌లా చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం శక్తి వంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా అరటి ముక్కలు, బాదం పాలలో అర కప్పు పాలను వేసి.. దానికి ఒక చెంచా ఓట్స్ వేసి, ఒక చెంచా వేరుశెనగ వెన్న ఆ తర్వాత  తేనె, 4 ఖర్జూరాల ముక్కలను వేసి మిక్సీలో రుబ్బుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న రసాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీర బరువు సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. అయితే అరటి పండును ఇలా కూడా తినొచ్చు. ఒక రోజులో కనీసం 2 అరటిపండ్లను సాదాగా తిండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. బరువు పెరగడమేకాకుండా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం


Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  



Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook