Weight Loss Diet: పండుగ సీజన్‌లో సులభంగా బరువు తగ్గడం ఎలాగో తెలుసా?
Weight Loss Diet Plan For Men: శరీర బరువు తగ్గాలనుకునేవారు పండగ సమయాల్లో కూడా అనారోగ్యకరమైన ఆహారాలు తింటూ ఉంటారు. ఇలాంటి సమయంలో తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Weight Loss Diet Plan For Men: భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి పండగ సీజన్ ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా కుటుంబ సభ్యులంతా ఒక చోట కలుసుకుని అన్ని రకాల ఆహారాలను ఆస్వాదిస్తారు. అయితే చాలా మంది ఇలాంటి సమయాల్లో అనారోగ్యకరమైన ఆహారాలు తింటూ ఉంటారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా శరీర బరువు కూడా పెరుగుతారు. ముఖ్యంగా శరీర బరువు తగ్గడానికి డైట్‌ని అనుసరిస్తున్నవారు ఈ సమయంలో తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరింత బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ కింది చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
శరీరక శ్రమ తప్పనిసరి:
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బిజీ బిజీగా మారుతున్నారు. దీని కారణంగా వ్యాయామం చేయడం మర్చిపోతున్నారు. దీని కారణంగా సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే తప్పకుండా వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరక శ్రమ కూడా తప్పనిసరి చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు సమతుల్యంగా ఉంటాయి. దీంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోండి:
పండుగల సీజన్‌లో నూనె, తీపితో కలిగి ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. అయితే బరువు తగ్గాలను వారు వీటిని తిన్న తర్వాత అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు కూరగాయలు, ప్రోటీన్లు, తృణధాన్యాలు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ను కూడా తాగాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
హైడ్రేటెడ్‌గా ఉండండి:
తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల బరువు పెరగడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే బరువు తగ్గించుకోవడం చాలా మంచిది. ఇలాంటి సమయంలో బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఆహారాలను ఎక్కువగా నమలండి:
బరువు తగ్గాలనుకునేవారు తినే ఆహారాలను నమలడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆహారాలు తీసుకున్న తర్వాత దాదాపు 1 గంట పాటు నడవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook