Weight Loss Diet Plan: తులసి డికాక్షన్‌తో చెడు కొలెస్ట్రాల్, బరువు సమస్యలకు 12 రోజుల్లో చెక్..
Weight Loss Diet Plan: తులసి డికాక్షన్ క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది.
Weight Loss Diet Plan: చలి కాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మేలు లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే సీజనల్ ఇన్ఫెక్షన్‌ల నుంచి సులభంగా ఉండడానికి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి తులసితో చేసిన డికాక్షన్ తాగడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని తాగడం వల్ల సులభంగా బరువును తగ్గి.. జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే తులసితో చేసిన డికాక్షన్‌తో పాటు జీలకర్రతో చేసిన డికాక్షన్ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
ఈ డికాక్షన్‌లను ఎలా తయారు చేయాలి:
ఈ డికాక్షన్‌లను తయారు చేయడానికి ముందుగా ఒక చెంచా ఎండిన జీలకర్రను తీసుకోండి. వీటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత ఉదయం 4 నుంచి 5 తులసి ఆకులను రాత్రంత నానబెట్టిన నీటిలో వేసి మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత నీటిని ఫిల్టర్ చేసి వేడిగా తాగొచ్చు. ప్రతి రోజూ ఇలా టీని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో తేనెను కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
తులసి డికాక్షన్ ప్రయోజనాలు:
తులసి డికాక్షన్ క్రమం తప్పకుండా తాగితే శరీరానికి సహజమైన డిటాక్స్ లభిస్తుంది.
గ్యాస్ట్రిక్ సమస్య తొలగిపోయి జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఔషధంలా పని చేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ డికాక్షన్ కీలక పాత్ర పోషిస్తుంది.
గ్యాస్ట్రిక్, జీర్ణక్రియ సమస్యలు సులభంగా తగ్గుతాయి.
ఎసిడిటీ సమస్య, కడుపులో మంటల సమస్యలు కూడా తగ్గుతాయి.
అంతేకాకుండా రక్తపోటు కూడా సులభంగా తగ్గిస్తుంది.
రక్త నాళాలలోకి కాల్షియం ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడతాయి.
Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం
Also Read : Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook